Begin typing your search above and press return to search.

యూఎస్ లో దారుణం... ఐదుగురిని కాల్చి చంపిన 15 ఏళ్ల బాలుడు!

ఈ క్రమంలో తాజాగా ఇంట్లో ఉన్న ఐదుగురిని కాల్చిన 15 ఏళ్ల బాలుడి వ్యవహారం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   22 Oct 2024 7:34 AM GMT
యూఎస్ లో దారుణం...  ఐదుగురిని కాల్చి చంపిన 15 ఏళ్ల బాలుడు!
X

అమెరికాలో తుపాకీ కల్చర్ కి అలవాటుపడుతున్న టీనేజర్స్ సంఖ్య రోజు రోజుకీ పెరుగిపోతున్నట్లుంది. ఈ విషయానికి బలం చేకూరుస్తూ ఇటీవల టీనేజర్స్ తుపాకీ కాల్పులకు పాల్పడిన ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇంట్లో ఉన్న ఐదుగురిని కాల్చిన 15 ఏళ్ల బాలుడి వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... గత కొంతకాలంగా అమెరికాలో గన్ కల్చర్ పై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పైగా ఇటీవల టీనేజర్స్, స్కూల్లో చదువుకునే పిల్లలు సైతం గన్ కల్చర్ కి అలవాటుపడుతున్నారనే చర్చ జరుగుతుంది. ఈ సమయంలో... వాషింగ్టన్ రాష్ట్రంలోని సీటెల్ సమీపంలోని ఓ ఇంట్లో దారుణం జరిగిపోయింది!

ఇందులో భాగంగా.. ఆ ఇంట్లోని ఐదుగురు వ్యక్తుల ప్రాణాలను బలిగొన్నాడు ఓ బాలుడు. దీంతో... ఈ ఘోరమైన కాల్పుల ఘటనకు సంబంధించిన 15 ఏళ్ల బాలుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సియాటిల్ కు తూర్పున ఉన్న ఫాల్ సిటీలో సోమవారం తెల్లవారు జామున ఈ కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు.

ఈ విషయాలపై కింగ్ కౌంటీ హెరీఫ్ కార్యాలయ ప్రతినిధి మైక్ మెల్లీస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న అనంతరం అధికారులు ఆ నివాసానికి చేరుకున్నారని.. లోనికి ప్రవేశించినప్పుడు ఐదు మృతదేహాలను కనుగొన్నారని తెలిపారు. వారిలో ఇద్దరు పెద్దలు, ముగ్గురు యువకులు ఉన్నట్లు చెప్పారు.

ఇదే సమయంలో.. ఈ కాల్పుల్లో గాయపడిన మరొక వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతడు మైనర్ కావడంతో కింగ్ కౌంటీ లోని బాల్య నిర్బంధ కేంద్రంలో ఉంచినట్లు చెబుతున్నారు.

కాగా... అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల తుపాకీ కాల్పులకు పాల్పడుతున్న టీనెజర్స్ వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల జార్జియాలోని ఓ హైస్కూల్ లో 14 ఏళ్ల బాలుడు.. ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు టీచర్స్ ని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీంతో.. అతడిపై హత్య కేసు నమోదైంది.

ఈ క్రమంలో తాజాగా ఇంట్లో ఉన్న ఐదుగురిని కాలిచంపి, మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన ఘటనలో 15 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.