Begin typing your search above and press return to search.

కొండాపూర్ లో 17 మంది ఫారిన్ అమ్మాయిలు... ‘ఆ’పనే చేస్తున్నారు!

ఈ దాడిలో 17 మంది విదేశీ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరంత రెండు దేశాలకు చెందినవారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 11:07 AM GMT
కొండాపూర్  లో 17 మంది ఫారిన్  అమ్మాయిలు... ‘ఆ’పనే చేస్తున్నారు!
X

హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ కు సమీపంలోని కొండాపూర్ లో ఓ షాకింగ్ విషయం వెలుగుచూసింది. ఈ వ్యవహారం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసిందని అంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17మంది ఫారిన్ అమ్మాయిలు ఓకే ఫ్లాట్ లో ఉండటం ఒకెత్తు అయితే.. వారు చేస్తోన్న పని మరొకెత్తు అని తెలుస్తోంది!

అవును... కొండాపూర్ లోని ఒక ఫ్లాట్ లో ఏకంగా 17 మంది ఫారిన్ అమ్మాయిలు ఉండటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. తమకు అందిన పక్కా సమాచారంతో ఎంట్రీ ఇచ్చిన మాదాపూర్ పోలీసులు ఈ సందర్భంగా అంతర్జాతీయ వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేశారు! వీరంతా ఒక ఇంటిని అద్దెకు తీసుకొని పూర్తి స్థాయిలో హైటెక్ వ్యభిచారం చేస్తున్నారని అంటున్నారు.

ఈ మేరకు కొన్ని వెబ్ సైట్లలో ప్రకటలు గుప్పిస్తూ.. సమీపంలోనే అమ్మాయిలు ఉన్నారని చెబుతూ.. మెసేజ్ లు పంపుతూ ఆకర్షిస్తున్నారని.. వ్యవహారానికి సంబంధించిన బేరసారాలు అన్నీ ఆన్ లైన్ లోనే పూర్తి చేసే విధానాన్ని వీరు అనుసరిస్తున్నారని చెబుతున్నారు. ఇలా వెబ్ సైట్ల ద్వారా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారని అంటున్నారు.

ఈ దాడిలో 17 మంది విదేశీ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరంత రెండు దేశాలకు చెందినవారని అంటున్నారు. ఈ సమయంలో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరిని సేఫ్ హౌస్ కు తరలించారని తెలుస్తోంది. ఇక ఇంత భారీ స్థాయిలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచార రాకెట్ గుట్టు రట్టుకావడం ఇదే తొలిసారని అంటున్నారు!

వీరు ఏ పని మీద మన దేశానికి వచ్చారు? ఎప్పటి నుంచి ఉంటున్నారు? వీరిని ఎవరైనా ట్రాప్ చేశారా? వీరి వెనుక ఉన్న వారెవరు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఒక వ్యభిచార రాకెట్ లో ఒకేసారి ఇంత మంది విదేశీ అమ్మాయిలు దొరకటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక వ్యక్తి నడుపుతున్నట్లు గుర్తించారని.. ఈ సమయంలో అతడితో పాటు ఇద్దరు విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో నిందితుడి నుంచి నాలుగు సెల్ ఫోన్లు, 25 హెచ్.ఐ.వీ. టెస్టింగ్ కిట్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారని అంటున్నారు.