Begin typing your search above and press return to search.

'కాస్ట్ కో'లో 19 ఏళ్ల వ్యక్తి మృతి... షాక్ లో ఇండియన్స్!

ఈ నేపథ్యంలో తాజాగా కాస్ట్ కో లోని రెస్ట్ రూమ్ లో ఓ యువకుడు మృతి చెందిన విషయం షాకింగ్ గా మారిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Dec 2024 6:47 AM GMT
కాస్ట్  కోలో 19 ఏళ్ల వ్యక్తి మృతి... షాక్  లో ఇండియన్స్!
X

అమెరికాలోని అనేక భారతీయ కుటుంబాలకు "కాస్ట్ కో" కేవలం షాపింగ్ చేసే స్థలం మాత్రమే కాదు.. అదొక వీకెండ్ డెస్టినేషన్ అని అంటారు. రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉన్నప్పటికీ, లేనప్పటికీ.. వారాంతంలో మాత్రం ఇది రెగులర్ గెట్ టుగెధర్ ప్లేస్ అని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా కాస్ట్ కో లోని రెస్ట్ రూమ్ లో ఓ యువకుడు మృతి చెందిన విషయం షాకింగ్ గా మారిందని అంటున్నారు.

అవును... అమెరికాలోని అనేక భారతీయ కుటుంబాలకు ఒక షాపింగ్ స్థలంగానే కాకుండా.. ఓ వీకెండ్ డెస్టినేషన్ గా, గెట్ టుగెదర్ గా మారిన మెకిన్నే కాస్ట్ కో లో 10 ఏళ్ల యువకుడు ఫ్యామిలీ రెస్ట్ రూమ్ లో చనిపోయిన విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగిందని అంటున్నారు. ఈ మరణానికి కారణం స్వయంగా తుపాకీతో కాలుచుకోవడమేనని చెబుతున్నారు.

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోల్లో... క్యాండిల్ లైట్ ప్రార్థనలో భాగంగా కూడుకుంటున్న నివాసితుల్లు ఒక్కసారిగా ఈ విషయం తెలియడంతో ఆటోజోన్ దుకాణం వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడిన గుంపును చూపించింది. ఈ నేపథ్యంలో.. ఈ ఘటన క్రిస్మస్ పండుగ వేళ ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని అంటున్నారు.

కాగా.. అమెరికాలోని ప్రతీ మూడింట ఒక భారతీయ కుటుంబాల్లో ఒకరు ఈ కాస్ట్ కో సభ్యత్వాన్ని కలిగి ఉంటారని చెబుతుంటారు. ప్రధానంగా కిరాణా సామాగ్రి, బల్క్ ఐటంస్ కోసం క్రమం తప్పకుండా విహారయాత్రలు చేస్తుంటారని.. కొన్ని సందర్భాల్లో అందులోని ఫుడ్ కోర్టుల్లో ఫిజ్జా లను ఆస్వాధిస్తారని చెబుతుంటారు.

అలా భారతీయ సమాజంలో ఎంతో మిలితమైన ఈ కాస్ట్ కో లో జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన స్థానిక భారతీయ కమ్యునిటీని షాక్ కి గురిచేసిందని అంటున్నారు. మరోపక్క విషయం తెలిసిన అనంతరం ఎంట్రీ ఇచ్చిన మెకిన్నే పోలీస్ అధికారులు.. నిఘా ఫుటేజ్ ని సమీక్షిస్తున్నారని తెలుస్తోంది.