పట్టాల మీదకు 2 వందే భారత్ ట్రైన్లు.. తెలుగు రాష్ట్రాలకు నో ఛాన్స్
వందేభారత్ ట్రైన్ల సిరీస్ లో భాగంగా స్లీపర్ ను పట్టాల మీదకు ఎక్కిస్తారని భావించారు.
By: Tupaki Desk | 31 Aug 2024 5:31 AM GMTవందేభారత్ ట్రైన్ల సిరీస్ లో భాగంగా ఈ రోజు నుంచి మరో రెండు రైళ్లు పట్టాల మీదకు ఎక్కనున్నాయి. అయితే.. ఈ రెండు రైళ్లు దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించారు. అయితే.. తెలుగు రాష్ట్రాలకు ఒక్క ట్రైన్ తోనూ లింక్ లేదు. కొత్తగా ప్రారంభించే రెండు వందే భారత్ లలో ఒకటి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - నాగర్ కోయల్ నుంచి కాగా.. మరొకటి మధురై ్- బెంగళూరు కంటోన్మెంట్ కు మధ్య రాకపోకలు సాగించనున్నాయి.
వందేభారత్ ట్రైన్ల సిరీస్ లో భాగంగా స్లీపర్ ను పట్టాల మీదకు ఎక్కిస్తారని భావించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైనంతనే.. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తాయని భావించారు. అధికారులు ఇదే విషయాన్ని చెప్పినా.. ఆచరణలో ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఇదిలా ఉంటే.. ఈ రోజు (శనివారం) నుంచి పట్టాలు ఎక్కే రెండు వందే భారత్ ట్రైన్ల విషయానికి వస్తే.. చెన్నై సెంట్రల్ - నాగర్ కోయల్ రైలు విషయానికి వస్తే.. ఉదయం 5 గంలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరుతుంది. మధ్యామ్నం 1.50 గంటలకు నాగర్ కోయల్ కు చేరుతుంది. తిరిగి 2జ20 గంటలకు నాగర్ కోయల్ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు చెన్నై సెంట్రల్ కు చేరుతుంది. బుధవారం మినహా వారంలో మిగిలిన అన్ని రోజుల్లోనూ దీన్ని నడుపుతారు.
మరో వందే భారత్ విషయానికి వస్తే.. మధురై - బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడుస్తుంది. ఉదయం 5.15 గంటల వేళలోమధురైలో బయలుదేరే ఈ వందే భారత్ ట్రైన్.. మధ్యాహ్నం 1 గంట వేళకు బెంగళూరు కంటోన్మెంట్ కు చేరుకుంటుంది. అరగంట తర్వాత అంటే.. 1.30 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 9.45 గంటలకు మధురైకు చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ ట్రైన్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కొన్ని వందేభారత్ లు ఇస్తామని చెబుతున్నా.. ఇప్పటివరకు ఆచరణలోకి మాత్రం రాలేదు.