Begin typing your search above and press return to search.

అయ్య బాబోయ్‌.. సెక‌నుకు న‌లుగురు.. నిమిషానికి 24 మంది పుడ‌తార‌ట‌!

అంటే.. ఒక నిమిషానికి.. 24 మంది పుట్ట‌నున్నారు. వారు ఆడైనా..మ‌గైనా.. ఎవ‌రైనా కావొచ్చు.. నిముషానికి 24 మంది పుట్ట‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   31 Dec 2023 12:30 AM GMT
అయ్య బాబోయ్‌.. సెక‌నుకు న‌లుగురు.. నిమిషానికి 24 మంది పుడ‌తార‌ట‌!
X

కొన్ని కొన్ని విష‌యాలు ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. నిజ‌మే. వాటి వెనుక చాలానే రీజ‌న్లు ఉంటాయి. ప్ర‌పంచంలో జ‌నాభా పెరుగుద‌ల విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. అమెరికాకు చెందిన జ‌న‌గ‌ణ‌న శాఖ అధికారులు ఒక సంచ‌ల‌న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. వ‌చ్చే ఏడాదిలో ప్ర‌పంచ వ్యాప్తంగా సెక‌నుకు 4 చొప్పున పిల్ల‌లు పుడ‌తార‌ని తేల్చి చెప్పారు. అంటే.. ఒక నిమిషానికి.. 24 మంది పుట్ట‌నున్నారు. వారు ఆడైనా..మ‌గైనా.. ఎవ‌రైనా కావొచ్చు.. నిముషానికి 24 మంది పుట్ట‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

విష‌యంలోకివెళ్తే.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ జ‌నాభాపై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కొన్ని దేశాల్లో జ‌నాభా త‌క్కువ‌గా ఉండ‌గా.. మ‌రికొన్ని దేశాల్లో జ‌నాభా ఎక్కువ‌గా ఉంది. ఇక‌, ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా జ‌నాభా పెరుగుతోంది. ఇలా పెరుగుతూ.. పోతే తిండి గింజ‌లు, నీరు, మౌలిక స‌దుపాయాల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నేది అమెరికా జ‌న‌గ‌ణ‌న శాఖ ఆందోళ‌న‌. ఈ విభాగం వెల్ల‌డించిన లెక్క‌ల ప్రకారం.. కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర సంగ‌తులు వెలుగు చూశాయి.

+ 2024 జ‌న‌వ‌రి నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కుని దాటేస్తుంది.

+ 2023లో ప్రపంచ జనాభా 7.5 కోట్ల మేర జ‌నాభా ఉంది.

+ 2024 జనవరి 1 నాటికి ఇది 800 కోట్ల మార్కుని అధిగమిస్తుంది.

+ 2024లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు సగటున 4.3 జననాలు, రెండు మరణాలు సంభవిస్తాయి. అంటే.. నిమిషానికి 24 మంది పుడితే.. అదేస‌మ‌యంలో 12 మంది మృతి చెందుతారు.

+ ఈ ఏడాది అమెరికాలో 17.5 లక్షల జననాలు నమోదయ్యాయి.

+ 2024 జనవరి 1 నాటికి అమెరికా జనాభా 33.58 కోట్లకు చేరుకుంటుంది

+ అమెరికాలో జనాభా తగ్గకుండా ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వ‌ల‌స‌లు.(ఇదే పెద్ద రాజ‌కీయ వివాదంగా కూడా ఉంది)