Begin typing your search above and press return to search.

రైలు చక్రాల మధ్య దాక్కుని 250 కి.మీ... అసలు విషయం ఇదే!

ఓ వ్యక్తి ఇటార్సీ నుంచి జబల్ పూర్ వరకూ సుమారు 250 కిలో మీటర్ల దూరాన్ని ఎక్స్ ప్రెస్ రైలు బోగీ కింద చక్రాల మధ్య దాక్కుని ప్రయాణించాడని ఆ వీడియోలో పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   29 Dec 2024 5:56 AM GMT
రైలు చక్రాల మధ్య దాక్కుని 250 కి.మీ... అసలు విషయం ఇదే!
X

సోషల్ మీడియాలో వైరల్ గా మారే విషయాలు కొన్ని సందర్భాల్లో సంతోషంగా అనిపిస్తే.. మరికొన్ని సందర్భంగా జుగుప్సాకరంగా ఉంటాయని అంటారు. ఇదే సమయంలో.. కొన్ని వీడియోలు సర్ ప్రైజ్ గా అనిపిస్తే, మరికొన్ని విషయాలు షాకింగ్ అనిపిస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇటీవల నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే.

దానికి కారణం... ఒక వ్యక్తి ఎక్స్ ప్రెస్ రైలు బోగీ కింద చక్రాల మధ్య దాక్కుని సుమారు 250 కి.మీ. మేర ప్రయాణించాడని అందులో పేర్కొనడమే! ఈ వీడియో నెట్టింట తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై రైల్వే శాఖ స్పందించింది. ఈ సందర్భంగా... వైరల్ అవుతున్న వీడియోలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

అవును... ఓ వ్యక్తి ఎక్స్ ప్రెస్ రైలు బోగీ కింద చక్రాల మధ్య దాక్కుని 250 కి.మీ. మేర ప్రయాణించాడనే వీడియో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఓ వ్యక్తి ఇటార్సీ నుంచి జబల్ పూర్ వరకూ సుమారు 250 కిలో మీటర్ల దూరాన్ని ఎక్స్ ప్రెస్ రైలు బోగీ కింద చక్రాల మధ్య దాక్కుని ప్రయాణించాడని ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఆ వీడియోలో.. ఆగి ఉన్న రైలు కోచ్ చక్రాల నుంచి ఓ వ్యక్తి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. రైలు టిక్కెట్ కొనుక్కునేందుకు డబ్బులు లేకపోవడంతోనే అతడు ఈ విధంగా చేశాడని కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. దీంతో.. పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా రైల్వే శాఖ స్పందించి.. క్లారిటీ ఇచ్చింది.

ఇందులో భాగంగా... ఆగి ఉన్న రైలులో వీల్ యాక్సిల్ నుంచి బయటకు వస్తున్న వ్యక్తిని ఎవరో వీడియో చిత్రీకరించారని.. టిక్కెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేనందున ఇలా చక్రాల మధ్య దాక్కుని ప్రయాణించాల్సి వచ్చిందని తప్పుదోవ పట్టించే వాదనతో దీన్ని ప్రసారం చేశారని రైల్వే అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా నకిలీ నివేదిక అని అన్నారు.

దీనిపై స్పందించిన రైల్వే బోర్డు సమాచార ప్రచార ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్.. రైలు కదలకుండా ఉన్నప్పుడు ఆ వ్యక్తి వీల్ యాక్సిల్ దగ్గర దాక్కున్నాడని.. కదులుతున్న రైలు చక్రాలపై మధ్యలో దాక్కోవడం ఎవరికీ ఆచరణ సాధ్యం కాదని.. కదులుతున్న వీల్స్ తో పాటు వీల్ సెట్ కూడా కదులుతుందని వెల్లడించారు.