Begin typing your search above and press return to search.

పార్క్ లో ప్రమాదం.. రూ.2,624 కోట్ల పరిహారం.. అంత ఎందుకంటే..?

పార్క్ లో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి 2,624 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   7 Dec 2024 5:47 AM GMT
పార్క్ లో ప్రమాదం.. రూ.2,624 కోట్ల పరిహారం.. అంత ఎందుకంటే..?
X

ఓ పార్క్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీనిపై ఆ బాలుడి తల్లితండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఇది పూర్తిగా కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యమే అని వెళ్లడించారు. విచారించిన కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా... మృతుడి కుటుంబానికి రూ.2,624 కోట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

అవును... పార్క్ లో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి 2,624 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ స్థాయిలో పరిహారాన్ని ప్రకటించడం వెనుక కోర్టుకు ఉండాల్సిన బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... టైర్ సాంప్సన్ (14) అనే బాలుడు 2022లో తన ఫుట్ బాల్ టీమ్ తో కలిసి అమెరికాలోని ఓర్లాండ్ లో గల ఐకాన్ పార్క్ కి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న ఫ్రీ పాల్ టవర్ ఎక్కాడు. వాస్తవానికి ఒక రైడ్ లో ఆ టవర్ 129 కిలోగ్రాముల బరువు మాత్రమే మోయగలదు!

అయితే... 6.2 అడుగుల పొడవున్న సాంప్సన్ బరువు 173 కిలో గ్రాములట! బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ సిబ్బంది ఆ బాలుడిని రైడ్ కూ వెళ్లేందుకు అనుమతించినట్లు చెబుతున్నారు. దీంతో... రైడ్ సమయంలో సాంప్సన్ సీటుబెల్టు ఊడిపోయింది. ఫలితంగా... అతడు సుమారు 70 అడుగుల దూరంలో ఎగిరి పడి, మృతిచెందాడు.

దీంతో... మృతుడి తల్లితండ్రులు ఫ్లోరిడాలోని కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన బాధితుల తరుపు న్యాయవాదులు... కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్లే సాంప్సన్ మృతి చెందారని.. రైడ్ కు సంబంధించిన తయారీదారులు ప్రయాణికుల భద్రత కంటే లాభాల మీదనే దృష్టిసరించారు అని కోర్టుకి తెలిపారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా... మృతుడి కుటుంబసభ్యులకు 310 మిలియన్ డాలర్లు (రూ.2,624 కోట్లు) పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కార్పొరేషన్ల భద్రత విషయంలో జవాబుదారీతనం తీసుకురావాలనే ఈ తీర్పునిస్తున్నట్లు వెల్లడించింది.