Begin typing your search above and press return to search.

నవంబర్‌ 23 ‍- డిసెంబర్‌ 15 మధ్య 32లక్షల పెళ్లిళ్లు... రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం!

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఈ సంవత్సరం పెళ్లిళ్ల సీజన్‌ లో కేవలం 23 రోజుల్లో రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసింది.

By:  Tupaki Desk   |   19 Oct 2023 8:52 AM GMT
నవంబర్‌ 23 ‍- డిసెంబర్‌ 15 మధ్య 32లక్షల పెళ్లిళ్లు... రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం!
X

"పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్లు.." అనే సినీ వర్ణన సింపుల్ గా చెప్పిన సంగతి తెలిసిందే. ప్రతీ వ్యక్తి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక అద్భుత ఘట్టం. ఇక వరుడి కుమారుడి పేరెంట్స్ కి కొత్త బాధ్యతలు.. ఆడపిల్ల తల్లితండ్రులకు కొత్త బంధాలు. ఈ క్రమంలో... ప్రతీ కుటుంబం ఆ ఇంటి బిడ్డ పెళ్లిని వారికి ఉన్నంతలో ఘనంగా చేయాలని తపిస్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి పెళ్ళిళ్ల సీజన్ స్టార్ట్ అవుతుంది.

అవును... పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది. వచ్చే నెల 23 నుంచి డిసెంబర్ 15వరకూ దేశవ్యప్తంగా సుమారు 32 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నవంబర్ లో భారీ ముహూర్తం ఉందని, ఆరోజు రాష్ట్రంలో సుమారు 50వేల పెళ్లిళ్లు ఉన్నాయని ఎన్నికల కమిషన్ పోలింగ్ తేదీనే మార్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఈ ఏడాది జరగబోయే పెళ్లిళ్లు ఎన్ని, వాటికి అయ్యే ఖర్చు సుమారుగా ఎంతుంటుంది అనే అంచనాలు తెరపైకి వచ్చాయి.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఈ సంవత్సరం పెళ్లిళ్ల సీజన్‌ లో కేవలం 23 రోజుల్లో రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం.. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల వివాహాలు జరగనున్నాయని అంటున్నారు. ఈ వివాహాలకు అయ్యే ఖర్చులవల్ల సుమారు రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని సర్వే తెలిపింది.

ఈ 32 లక్షల వివాహాల్లోనూ... సుమారు 10 లక్షల వివాహాలకు రూ.6 లక్షలు, మరో 12 లక్షల వివాహాలకు ఒక్కోదానికీ రూ.10 లక్షల చొప్పున ఖర్చు అవుతుందని ఆ సర్వే చెబుతుంది. కాగా... గత సంవత్సరం అదే 23 రోజుల సమయంలో మొత్తం 32 లక్షల వివాహాలు జరిగాయని చెబుతున్నారు. అయితే నాడు ఆ 32 లక్షల వివాహాలకుగానూ... రూ.3.75లక్షల కోట్ల వ్యాపారం నమోదైందని ఈ సర్వే చెప్పింది.

ఇదే క్రమంలో... ఒక మధ్యతరగతి వివాహ వేడుకకు అయ్యే ఖర్చులను సుమారుగా అంచనా వేస్తున్నారు. ఇందులో అధికంగా గరిష్టంగా ఖర్చు ఒకరోజు కల్యాణ మండపం అద్దెకే అయిపోతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... సుమారు రూ.2లక్షలు అవూతుంటుంది. పూల అలంకరణ, ఇతర వినియోగాలకు రూ.1.50లక్షలు.. భోజనాల నిమిత్తం రూ.1.80క్షలు ఖర్చు అవుతుందని లెక్కగడుతున్నారు.

అదేవిధంగా... వంట మనుషులు, సహాయకులు, కిరాణా సరకులు, కూరగాయల ఖర్చు, సన్నాయి వాయిద్యాలు, జనరేటర్‌, విద్యుత్తు లైట్లు, వీడియో గ్రాఫర్‌ ఇలా లెక్కేసుకుంటూ పోతే ముందుగా అనుకున్న ఖర్చుకు కాస్త అటు ఇటుగా అవుతుందని అంటున్నారు.