Begin typing your search above and press return to search.

పోలీసుల సమక్షంలో వారానికి 3 రోజుల చొప్పున భర్తను పంచేసుకున్నారు!

సినిమాల్లో చూసే కొన్ని సీన్లు..నిజ జీవితంలో ఎదురవుతుంటాయి. తాజాగా చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే.

By:  Tupaki Desk   |   20 Feb 2025 6:30 AM GMT
పోలీసుల సమక్షంలో వారానికి 3 రోజుల చొప్పున భర్తను పంచేసుకున్నారు!
X

సినిమాల్లో చూసే కొన్ని సీన్లు..నిజ జీవితంలో ఎదురవుతుంటాయి. తాజాగా చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడి పంచాయితీ పోలీసుల చెంతకు చేరటం.. రోటీన్ కు కాస్త భిన్నంగా ఉన్న ఈ ఇష్యూను సామరస్యపూర్వకంగా సెటిల్ చేయటమే కాదు.. పోలీసులు సూచనకు ఇద్దరు భార్యలు.. సదరు భర్త ఓకే అనటమే దీని వ్యవహారం ప్రత్యేకతగా చెప్పాలి. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ వ్యవహారం వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..

బిహార్ లోని పూర్ణియాకు చెందిన ఒక వ్యక్తి ఏడేళ్ల క్రితం మొదటి భార్యకు చెప్పకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి గురించి తెలిసినంతనే మొదటి భార్య షాక్ కు గురైంది. పోలీసులకు కంప్లైంట్ చేసింది. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి ఎలా చేసుకుంటాడు? అంటూ తన భర్త మీద ఫైర్ అయిన ఆమె.. తనను.. తన పిల్లల్ని సరిగా చూసుకోవటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. ఈ వ్యవహారాన్ని స్థానిక ఎస్పీ కార్తికేయ శర్మ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ కు అప్పజెప్పారు.

కౌన్సెలింగ్ లో భాగంగా తాను చేసిన తప్పును భర్త అంగీకరించాడు. మొదటి భార్యతో కలిసి ఉండేందుకు సిద్ధమవుతున్న వేళ.. రెండో భార్య తన సంగతేంటి? అంటూ ప్రశ్నిస్తూ పంచాయితీకి దిగింది. దీంతో.. ఈ ఇద్దరు భార్యల గొడవ తారాస్థాయికి చేరింది. ఎవరిని వదిలి పెట్టినా... మిగిలిన వారికి ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని గుర్తించిన ఫ్యామిలీ కౌన్సెల్ ఒక ఒప్పందాన్ని ఇరువురు మధ్య జరిగేలా చేశారు. వారంతో చెరో మూడు రోజులు భర్తను పంచుకోవాలని.. మిగిలిన ఒక్క రోజు భర్తకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండే ఆలోచనను చెప్పారు. దీనికి ఇరువురు భార్యలు ఒప్పుకోవటంతో ఈ ఇష్యూ ఒక కొలిక్కి వచ్చింది. అదే సమయంలో మొదటి భార్య పిల్లలకు అవసరమైన చదువు.. ఆహారంతో పాటు ప్రతి నెలా రూ.4వేలు ఇవ్వాలని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ చెప్పగా.. అందుకు సదరు భర్త ఓకే చెప్పటంతో ఈ కథ సుఖాంతమైంది. ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.