Begin typing your search above and press return to search.

ఫోర్బ్స్‌ అమెరికా సంపన్న మహిళల్లో ముగ్గురు భారతీయులు!!

వీరిలో ఆరిస్టా నెట్ వర్క్ సీఈవో జయశ్రీ ఉల్లాల్, సెంటెల్ ఐటీ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథీ, కాన్ ఫ్ల్యూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే ఉన్నారు.

By:  Tupaki Desk   |   24 July 2024 6:01 AM GMT
ఫోర్బ్స్‌  అమెరికా సంపన్న మహిళల్లో ముగ్గురు భారతీయులు!!
X

అమెరికాలో స్వయంకృషితో ఎదిగిన మహిళా సంపన్నుల జాబితాను తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ముగ్గురు భారత సంతతి మహిళలకు చోటు దక్కింది. వీరిలో ఆరిస్టా నెట్ వర్క్ సీఈవో జయశ్రీ ఉల్లాల్, సెంటెల్ ఐటీ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథీ, కాన్ ఫ్ల్యూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే ఉన్నారు.

అవును... భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలను ఫోర్బ్స్ అమెరికా అత్యంత సంపన్న మహిళలుగా గుర్తించింది. వారి వ్యక్తిగత ఆస్తుల విలువతో పాటు.. కంపెనీల్లో వారికి ఉన్న వాటాలా అధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు పోర్బ్స్ వెల్లడించింది. దీంతో... ప్రపంచ మహిళాలోకం నుంచి వీరు ప్రశంసలు, అభినందనలు అందుకుంటున్నారు!

జయశ్రీ ఉల్లల్: ఈమె 3.6 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో 11వ స్థానంలో ఉన్నారు. ఈమె 2008 నుంచి కంప్యూటర్ నెట్ వర్కింగ్ సంస్థ అయిన అరిస్టా నెట్ వర్క్స్ కి సీఈవోగా ఉన్నారు. ఈ కంపెనీలో 2023లో సుమారు 5.9 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఉల్లాల్... అరిస్టా స్టాక్ లో సుమరు 3% వాటాను కలిగీ ఉన్నారు. అందులో కొంత భాగాన్ని ఆమె ఇద్దరు పిల్లలు, మేనకోడలు, మేనల్లుడు కోసం కేటాయించారని తెలుస్తుంది.

నీర్జా సేథీ: ఈమె 1 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో 27వ స్థానలో ఉన్నారు. ఈమె తన భర్త భరత్ దేశాయ్ తో కలిసి 1980లో మిచిగాన్ లోని ట్రాయ్ లోని వారి అపార్ట్మెంట్ లో ఐటీ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్ సంస్థ సింటెల్ ను స్థాపించారు. ఈ సమయంలో ఫ్రెండ్ ఐటీ సంస్థ అటోస్ 2018లో 3.4 బిలియన్ డాలర్లకు సింటెల్ ను కొనుగోలు చేసింది. సేథి తన వాటా కోసం 510 మిలియన్ డాలర్లను దక్కించుకున్నారు!

1980 నుంచి సింటేల్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన సేథీ... తన భర్తతో కలిసి కేవలం 2,000 యూఎస్ డాలర్ల పెట్టుబడితో తొలుత వ్యాపారాన్ని ప్రారంభించారు.

నేహా నార్ఖడే: క్లౌడ్ కంపెనీ కాన్ ఫ్ల్యూయెంట్ కో ఫౌండర్, ఎక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయిన ఈమె 680 మిలియన్ డాలర్ల నికర ఆస్తులతో ఫోర్బ్స్ జాబితాలో 50వ స్థానంలో ఉన్నారు. లింక్డ్‌ ఇన్ లో పనిచేసిన అనంతరం 2014లో ఇద్దరు సహోద్యోగులతో కలిసి కాన్ ఫ్లూయెంట్ ఆలోచన చేశారు. ఇందులో ఈమె వాటా సుమారు 6%గా ఉన్నారు!