Begin typing your search above and press return to search.

కెనడాలో ఘోర ప్రమాదం... ముగ్గురు ఇండియన్ స్టూడెంట్స్ మృతి!

ఇందులో భాగంగా... తాజాగా కెనడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు.

By:  Tupaki Desk   |   30 July 2024 5:05 AM GMT
కెనడాలో ఘోర ప్రమాదం... ముగ్గురు ఇండియన్  స్టూడెంట్స్  మృతి!
X

గత కొంతకాలంగా విదేశాల్లో వివిధ కారణలా వల్ల మృతి చెందుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గత ఐదేళ్లలో సుమారు 633 మంది భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో విదేశాల్లో మరణించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది.

ఈ క్రమంలో తాజాగా మరో ముగ్గురు భారతీయ విద్యార్థులు విదేశాల్లో మృతి చెందారు. ఇందులో భాగంగా... తాజాగా కెనడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. దీంతో... ఇక్కడున్న వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. న్యూ బ్రున్స్విక్ లోని మిల్ కోవ్ లో ఈ ప్రమాదం జరిగింది.

అవును... కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న ట్యాక్సీ కారు టైరు ఒక్కసారిగా పగిలిపోవడంతో.. వాహనం పూర్తిగా అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం నెలకొందని అంటున్నారు. వీరంతా పంజాబ్ రాష్ట్రంలోని లీథియానా, సంగ్రూర్ జిల్లాలకు చెందిన వారని అంటున్నారు.

ఇందులో భాగంగా మృతుల్లో ఇద్దరు సోదరులు హర్మాన్ సోమల్ (23), నవజోత్ సోమల్ (19) లు లూథియానా జిల్లాకు చెందినవారు కాగా.. రష్మ్ దీప్ కౌర్ (23) సంగ్రూర్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో టాక్సీ డ్రైవర్ బయట పడ్డాడని అంటున్నారు. ఈ నెల 27 రాత్రి 9:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు... రన్నింగ్ లో ఉండగా కారు టైర్ పగిలిపోవడం వల్లే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని.. ఫలితంగా వాహనం హైవే నుంచి పక్కకు తాప్పి బోత్లాపడినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులూ వాహనం నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.