Begin typing your search above and press return to search.

3 సెకన్ల ప్రాడక్ట్ ప్రమోషన్‌... వారానికి రూ.120 కోట్లు... ఏంటిది?

ఒక్కో ఉత్పత్తికీ 3 సెకన్లు మాత్రమే కేటాయించి ఆమె చేసే ప్రమోషన్స్ పీక్స్ లో సంపాదన ఇస్తుంది.

By:  Tupaki Desk   |   9 Feb 2024 3:58 AM GMT
3 సెకన్ల ప్రాడక్ట్  ప్రమోషన్‌... వారానికి రూ.120 కోట్లు... ఏంటిది?
X

కాలం కలిసి రాకపోతే సముద్రంలో ఫిష్, కాకహోటల్ లో డిష్ అవుతుందని అంటారు! ఇదే సమయంలో... కాలం కలిసి వస్తే ఎవరైనా రాజు అవ్వొచ్చని అంటుంటారు!! ఆ సంగతి అలా ఉంటే... ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ సంపాదన ఒక రేంజ్ లో ఉంటుంది అనడానికి మరో తాజా ఉదాహరణ తెరపైకి వచ్చింది. ఒక్కో ఉత్పత్తికీ 3 సెకన్లు మాత్రమే కేటాయించి ఆమె చేసే ప్రమోషన్స్ పీక్స్ లో సంపాదన ఇస్తుంది.

అవును... ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్స్ వివిధ రకాల ప్రాడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ డబ్బులు బాగానే సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒక చైనీస్ యువతి సంపాదన ఒక రేంజ్ లో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈమె ఒక ఉత్పత్తి ప్రమోషన్ కి 3 సెకన్లు మాత్రమే కేటాయిస్తుంది. ఈ క్రమంలో అనేక ఉత్పత్తులు ప్రమోట్ చేస్తూ వారానికి రూ.120 కోట్లు సంపాదిస్తోంది.

మరీ 3 సెకన్లు ప్రమోషన్ అంటే... అలా వచ్చి ఇలా పోతుంది కదా అని అంటారా? మరి ఆమె డిమాండ్ అలా ఉంది! మరీ మెరుపు వేగంతో అన్నట్లుగా అనేక ఉత్పత్తులను తన వీడియోల్లో ప్రమోట్ చేస్తుంటుంది. ఇలా ఒక్కో ఉత్పత్తికి కేవలం 3 సెకన్ల సమయం మాత్రమే వెచ్చిస్తూ వారానికి దాదాపుగా 14 మిలియన్ల డాలర్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.120 కోట్లు సంపాదిస్తుందన్న మాట.

కాగా... ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదిక.. అనేకమంది సోషల్ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్లకు ఆదాయ వనరుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ప్రత్యేక ప్రకటనల ద్వారా మాత్రమే తమ ఉత్పత్తును ప్రమోట్ చేసే దగ్గర నుంచి ఇప్పుడు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్లు తమ వీడియోలలో ప్రమోషన్లు చేస్తూ పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే టిక్ టాక్ చైనీస్ వెర్షన్ డౌయిన్‌ లో ఐదు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ జెంగ్ జియాంగ్ అనే యువతి ఈ రేంజ్ లో సంపాదిస్తుంది.