Begin typing your search above and press return to search.

ఏపీలో రూ.40 కోట్ల క్రిప్టో మోసం... ఎలా జరిగిందంటే..?

వివరాళ్లోకి వెళ్తే... డోన్ పట్టణాన్నికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి.. కేవ ఇండస్ట్రీస్ పేరుతో ఆన్ లైన్ వ్యాపారం ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 Nov 2024 3:52 AM GMT
ఏపీలో రూ.40 కోట్ల క్రిప్టో మోసం... ఎలా జరిగిందంటే..?
X

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు, వివిధ యాప్ లలో మోసాలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రజలను మోసం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.. వాటి మాయలో పడి ప్రజలు మోసపోతూనే ఉంటున్నారు. పోలీసులు ఎంత హెచ్చరించినా.. ప్రజలు వారి బాడిన పడుతూనే ఉన్నారు.

తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం.. అతి తక్కువ సమయంలోనే డబ్బు రెట్టింపు వంటి ప్రకటనలకు అట్రాక్ట్ అవ్వడం.. అనంతరం అది మోసం అని తెలిసిన తర్వాత లబోదిబో అనడం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా 200 మంది ప్రజలు కర్నూలు జిల్లాలో ఇలానే నమ్మారు.. దెబ్బ తిన్నారు!

అవును... ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉంటున్నారు. అలా మాయలో పడి సుమారు 200 మంది ప్రజలు బాధితులుగా మారిన తాజా ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల సమీపంలోని డోన్ లో క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి నడిచిన ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... డోన్ పట్టణాన్నికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి.. కేవ ఇండస్ట్రీస్ పేరుతో ఆన్ లైన్ వ్యాపారం ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. అయితే... క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ స్థానికలకు ఆశ చూపించాడు. దీంతో అతడి మాటలు నమ్మిన జనం.. భారీగానే డబ్బులు పెట్టారు.

అయితే... గత కొంతకాలంగా సదరు రామాంజనేయులు ఫోన్ ఎత్తడం మానేశాడట. దీంతో.. అనుమానం వచ్చిన వారు అతడి కార్యాలయానికి చేరుకోగా.. తలుపుకి తాళం దర్శనమిచ్చిందంట. ఈ పరిణామాల నేపథ్యంలో తాము నిలువునా మోసపోయామని గ్రహించినవారు పోలీసులను ఆశ్రయించారు!

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సుమారు 200 మంది బాధితులు రూ.40 కోట్ల వరకూ రామాంజనేయులు వద్ద పెట్టుబడిగా పెట్టారని చెబుతున్నారు. మరోవైపు అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.