పోలింగ్ రోజు 50వేల పెళ్లిళ్లు... ఎన్నికల కమిషన్ ముహూర్తం చూసిందా?
అయితే మరోపక్క... ఆ రోజు సుమారు 50వేళ పెళ్లిళ్లు ఉన్నాయని ఇదే సమయంలో జాతర కూడా ఉందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 10 Oct 2023 1:50 PM GMTదేశంలో అత్యంత కీలకంగా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యలో పోలింగ్ రోజు 50వేళ పెళ్లిళ్లు ఉన్నాయని అంటున్నారు.
అవును... అధిక శాతం పోలింగ్ జరగాలని కోరుకుందో.. లేక, వీలైనంతర ప్రశాంతంగా ఎన్నికలు ముగియాలని వేడుకుందో తెలియదు కానీ... ఎన్నికల కమిషన్ మాంచి ముహూర్తాన్ని పోలింగ్ కోసం ఎంచుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! అయితే మరోపక్క... ఆ రోజు సుమారు 50వేళ పెళ్లిళ్లు ఉన్నాయని ఇదే సమయంలో జాతర కూడా ఉందని తెలుస్తుంది. దీంతో పోలింగ్ శాతంపై ఈ వ్యవహారం ఏ మేరకు ప్రభావం చూపబోతోందనేది ఆసక్తిగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... నవంబర్ 23న రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలకు డేట్ ఫిక్స్ చేసింది ఎన్నికల కమిషన్ . ఇప్పుడు ఈ తేదీనే రాజస్థాన్ ప్రజలకు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టిందని అంటున్నారు. కారణం... ఆ రోజున రాష్ట్రంలో సుమారు 50 వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందట. అంతేకాకుండా.. అదేరోజున ఖాతు శ్యాం జీ జాతర కూడా ఉందట. అది కూడా ముఖ్యమైన వేడుక అని అంటున్నారు.
దేవుత్తని ఏకాదశి పవిత్ర సమయం నవంబర్ 23 కావడంతో... ఈ రోజున రాష్ట్రంలో 50 వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని.. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పెళ్లిళ్ల వల్ల ఓటింగ్ పై ప్రభావం పడుతుందా అనే ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు. ఇదే సమయంలో... ఖాతు శ్యాం జీ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది పాల్గొంటారని చెబుతున్నారు. దీని ప్రభావం కూడా ఓటింగ్ శాతంపై పడుతుందా అనే ప్రశ్న తలెత్తుతోందని చెబుతున్నారు.
రాజస్థాన్ లో ఒకేరోజు వేల పెళ్లిళ్లు అంటే... వధూవరుల కుటుంబాలతోపాటు, వారి బంధువుల కుటుంబాలు, స్నేహితులు, టెంట్ హౌజ్ వ్యాపారులు, ఈవెంట్ మేనేజర్లు, పూల వ్యాపారులు, కిరాణా వ్యాపారులు, బ్యాండ్ వారు, కొరియోగ్రాఫర్లు, ఎలక్ట్రీషియన్లు, క్యాటరర్లు, వివిద రకాల వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు సహా సుమారు 20 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకుంటారని అంటున్నారు
ఇలాంటి పరిస్థితిలో... ఎన్నికల సమయంలో పెళ్లిళ్ల శుభ ముహూర్తం కారణంగా ఓటింగ్ శాతం ఎంతమేర ప్రభావితం అవుతుంది అనేది చర్చనీయాంశం అవుతుంది. కాగా... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజాస్థాన్ రాష్ట్రంలో 74.71 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం, అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.