Begin typing your search above and press return to search.

ప్రపంచంలో 7000 "జాంబీ కంపెనీలు".. ఎంత ప్రమాదం అంటే..?

అవును... అసోసియేటెడ్ ప్రెస్ అనాలసిస్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 7000 జాంబి కంపెనీలు ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   9 Jun 2024 5:10 AM GMT
ప్రపంచంలో 7000 జాంబీ కంపెనీలు.. ఎంత ప్రమాదం అంటే..?
X

జాంబీ అనే సినిమాలు వచ్చిన తర్వాత అవి ఎంత ప్రమాదకరంగా ఉంటాయనేది తెలుసు కానీ... ఈ జాంబీ కంపెనీలు ఏమిటి అని ఎవరైనా అనుకోవచ్చు! అయితే ఈ కంపెనీలు అంతకంటే ప్రమాదం అని అంటున్నారు పరిశీలకులు. పైగా వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని.. ఈ విషయంలో అగ్రరాజ్యం, పేదదేశం అనే తారతమ్యాలేవీ లేవని అంటున్నారు.

అవును... అసోసియేటెడ్ ప్రెస్ అనాలసిస్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 7000 జాంబి కంపెనీలు ఉన్నాయని అంటున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి, వడ్డీలు కూడా చెల్లించలేక, మనుగడ ప్రశ్నార్థకంగా మారిన కంపెనీలను జాంబీ కంపెనీలుగా వ్యవహరిస్తుంటారు. అయితే... గత పదేళ్ల కాలంలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగిందని అంటున్నారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయి మనుగడ అంచున కొట్టుమిట్టాడుతూ రుణాలపై వడ్డీని కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న కంపెనీలను జాంబీ కంపెనీలుగా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి జాంబీ కంపెనీల సంఖ్య గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో ఒక్క యునైటెడ్ స్టేట్స్ లోనే ఇటువంటి కంపెనీల సంఖ్య 2000కు చేరిందని అంటున్నారు.

ఇదే సమయంలో ఇటలీకి చెందిన టెలికాం కంపెనీ ఇటాలియా, బ్రిటీష్ సాకర్ దిగ్గజం మాంచెస్టర్ యునైటెడ్ లను నడుపుతున కంపెనీలతో సహా ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్ డమ్ లలో పలు కంపెనీలు ఈ స్థితికి చేరుకున్నాయని.. వీటి సంఖ్య సుమారు 30 శాతం పెరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ అనాలసిస్ లో తేలిందని చెబుతున్నారు.

కాగా మార్చి నెలలో ఫెడరల్ రిజర్వ్ కోత ప్రారంభిస్తుందనే అంచనాలతో రుణాలు ఇచ్చేవారు తమ వాలెట్లను ఓపెన్ చేశారని.. ఫలితంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే వందలాది జాంబి కంపెనీలు తమ రుణాలను రీఫైనాన్స్ చేసుకున్నాయని అంటున్నారు. దీంతో... గత ఆరునెలల్లో సుమారు 1,000 కి పైగా జాంబీ కంపెనీల స్టక్స్ 20శాతానికి పెరిగినట్లు చెబుతున్నారు.

ఇదే క్రమంలో మిగిలిన కంపెనీలన్నీ రీఫైనాన్స్ పొందలేకపోయాయని అంటున్నారు. ఏది ఏమైనా... ఈ ఏడాది తొలి, ఏకైక ఫెడ్ కోతను ఆశిస్తున్న నేపథ్యంలో ఈ జాంబీ కంపెనీలు అన్నీ కలిసి సుమారు 1.1 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉందని అంటున్నారు. దీంతో... ఈ జాంబి కంపెనీల వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ రుణాలు చెల్లించని పక్షంలో తీవ్రమైన నిరుద్యోగ సంక్షోభం వస్తుందంటున్నారు.