ప్రేమ ఇంత గుడ్డిదా.. వృద్ధుడిని యువతి పెళ్లి చేసుకోవడంపై నెటిజన్ల ఇంట్రస్టింగ్ కామెంట్స్
ప్రేమ గుడ్డిది అని అంటుంటారు. దానికి కులం, మతంతో సంబంధం ఉండదని చెబుతుంటారు.
By: Tupaki Desk | 27 Sep 2024 9:30 AM GMTప్రేమ గుడ్డిది అని అంటుంటారు. దానికి కులం, మతంతో సంబంధం ఉండదని చెబుతుంటారు. పేద, ధనిక అనే భేదాభిప్రాయాలూ కనిపించవు. ఏ వయసులో ఎలా పుడుతుందో కూడా తెలియదు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని జంటలను చూస్తుంటే కూడా సోషల్ మీడియాలో వెరైటీగా మీమ్స్ వచ్చిపడుతుంటాయి. అందంగా ఉన్న అమ్మాయి, అంతంత మాత్రంగానే కలర్ ఉన్న అబ్బాయిని ప్రేమిస్తుండడం.. పెళ్లి చేసుకోవడం చూసి ఇలాంటి కామెంట్స్ వస్తుంటాయి. అందుకే ప్రేమకు కలర్‌తో కూడా సంబంధం లేదనేది వాస్తవం.
అయితే.. ప్రేమ గుడ్డిదే అయినప్పటికీ మరీ ఇంత దారుణమా అని ఈ సంఘటనను చూసి నోరు వెళ్లబెట్టాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఓ వృద్ధుడి పట్ల అమ్మాయి ఆకర్షితురాలైంది. 20 ఏళ్ళ అమ్మాయి 70 ఏళ్ళ వృద్ధుడిని పెళ్లిచేసుకోవడం ఆ వీడియోలో కనిపించింది. ఆ వివాహ వేడుకలో ఇరువురి కుటుంబసభ్యులు సైతం ఉన్నారు. అమ్మాయి పెళ్లి కూతురు దుస్తుల్లో కనిపించగా.. పెళ్లి కొడుకైన వృద్ధుడు తెల్లటి కుర్తా పైజామా ధరించి ఉన్నాడు.
ఇద్దరూ కూడా సంతోషంలో మునుగుతూ ఆ పెళ్లి చేసుకోవడం కనిపించింది. ఇద్దరు కూడా ఒకరిమెడలో ఒకరు దండలు వేసుకోగా.. కుటుంబసభ్యులు పూల వర్షంతో ముంచెత్తారు వారిద్దరిని. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగాక కామెంట్స్ పెడుతున్నారు. ‘ప్రేమ గుడ్డిదే.. కానీ మరీ ఇంత గుడ్డిదని అనుకోలేదు’ అని కొందరు అంటుండగా.. మరికొందరేమో అబ్బాయి దగ్గర ఉన్న డబ్బును చూసి అమ్మాయి తరఫు వాళ్లు డబ్బుకు ఆశపడి ఇలా చేసి ఉండవచ్చు’ అని రాసుకొస్తున్నారు. ఫైనల్‌గా వారిద్దరి సంసారం జీవితం సుఖసంతోషాలతో సాగాలని మరికొందరు బ్లెస్సింగ్స్ ఇవ్వడం కనిపించింది.