Begin typing your search above and press return to search.

చాపర్ తీసుకెళ్తున్న హెలీకాప్టర్ కింద పడిపోయింది... వీడియో వైరల్!

ఈ సమయంలో.. క్రెస్టల్ హెలీకాప్టర్ ను యాత్రికులను తరలించేందుకు వినియోగించేవారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 7:44 AM GMT
చాపర్  తీసుకెళ్తున్న హెలీకాప్టర్  కింద పడిపోయింది... వీడియో వైరల్!
X

ఇటీవల ఉత్తరాఖండ్ లో భారీవర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసిన సంగతి తెలిసిందే. ఆ భారీ వర్షాల కారణంగా కేదార్ నాథ్ యాత్రను ఆగస్టులో నిలిపివేశారు. దీంతో... యాత్రికులు ఇక్కడికి చేరుకొవడానికి వాయుమార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ సమయంలో.. క్రెస్టల్ హెలీకాప్టర్ ను యాత్రికులను తరలించేందుకు వినియోగించేవారు.

అయితే... ఇటీవల కేదార్ నాథ్ లో ఓ క్రెస్టల్ హెలీకాప్టర్ ల్యాండింగ్ సమయంలో దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే... ఈ హెలీకాప్టర్ ను అక్కడనుంచి తరలించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా దాన్ని తరలించేందుకు ఆర్మీ ఎంఐ-17 ఛాపర్ ను తెప్పించారు.

దీంతో... ఈ ఉదయం ఆ క్రెస్టల్ హెలీకాప్టర్ ను ప్రత్యేకమైన కేబుల్స్ తో కట్టి ఎంఐ-17 ఛాపర్ తో తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత ఈ హెలీకాప్టర్ కు అమర్చిన తీగలు తెలిపోయాయి. దీంతో... కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి ఆ క్రెస్టల్ హెలీకాప్టర్ కొండపై పడిపోయింది.

కేదార్ నాథ్ – గచౌర్ మధ్య భీంబాలీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే... ఈ ఘటనలో ఎవరైనా గయపడ్డారా, ఎలాంటి నష్టం వాటిల్లింది అనే విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేధార్ నాథ్ – గౌరీకుండ్ మధ్య వేలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. దీంతో వారందరినీ రక్షించేందుకు సైన్యం, వాయుసేన.. చినూక్, ఎంఐ - 17 హెలీకాప్టర్లను వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ల్యాండింగ్ సమయంలో దెబ్బతిన్న క్రెస్టల్ హెలీకాప్టర్ ను తరలించే ప్రయత్నం చేయగా అది కింద పడిపోయింది.