రెస్టారెంట్ లో ఇంట్రస్టింగ్ బోర్డు.. నెట్టింట ఆసక్తికర చర్చ!
అయితే... ఇలాంటి విషయాలు అత్యంత సహజమనే వారు లేకపోలేదు! ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో మరీ సహజం అని చెబుతుంటారు.
By: Tupaki Desk | 8 March 2025 5:00 AM ISTసాధారణంగా ఏదైనా హోటల్, రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు అక్కడ వైట్ అండ్ వైట్ ధరించో.. లేక, చేతులో ల్యాండ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు పట్టుకునో కొందమంది కనిపిస్తుంటారని.. 4 టీలు ఆర్డర్ ఇచ్చి సుమారు నాలుగు గంటలపాటు తెగ చర్చించేస్తుంటారని పలువురు హోటల్ యజమానులు చెబుతుంటారు.
అయితే... ఇలాంటి విషయాలు అత్యంత సహజమనే వారు లేకపోలేదు! ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో మరీ సహజం అని చెబుతుంటారు. అయితే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఓ రెస్టారెంట్ యాజమాన్యం ఓ ఆసక్తికరమైన కండిషన్ పెట్టింది. ఈ విషయం ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీసింది. దీనిపై నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో క్రియేటివిటీ చూపిస్తూ స్పందిస్తున్నారు.
అవును... హోటళ్లు, రెస్టారెంట్లలో కాఫీ, టీ, సమోసా వంటివి ఏవో ఆర్డర్ ఇచ్చి గంటల తరబడి డిస్కషన్స్ చేసే వాళ్లు ఎక్కువైపోతున్నారంటూ ఆయా యజమానులు చెబుతుంటారు. వెళ్లమని చెప్పలేము.. ఉండమని అనలేము అని అంటున్నారు. అయితే.. బెంగళూరులోని ఓ హోటల్ యాజమాన్యానికి కూడా ఇలాంటి సమస్యే రావడంతో.. ఓ ఆసక్తికరమైన కండిషన్ తో కూడిన బోర్డు ఏర్పాటు చేసింది!
ఇందులో భాగంగా... బెంగళూరుకు చెందిన ‘పాకశాల’ అనే రెస్టారెంట్... రాజకీయాలు, రియల్ ఎస్టేట్ కు సంబంధించిన చర్చలు ఇక్కడ చేయొద్దని.. ఈ సందర్భంగా అర్థం చేసుకుని, ఈ విషయంలో తమకు సహకరించాలని ఓ బోర్డు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సందర్భంగా... నిజమే మరి ఒక టీ కొనుక్కొని గంటలు గంటలు మీటింగ్స్ పెడుతుంటారు.. దీనివల్ల పక్కవారికి ఎంత అసౌకర్యంగా ఉంటుంది అనేది గ్రహించరు అని ఒకరంటే... ఆ సమయంలో రాజకీయ చర్చలు, సినిమా కబుర్లు కాక మరేమి మాట్లాడుకోవాలి అని మరొకరు స్పందించారు. ఈ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.