Begin typing your search above and press return to search.

12 ఏళ్ల అబ్బాయితో 15 ఏళ్ల బాలిక జంప్... ఇది మూడోసారంట!

అలా అని ఒంటరిగా కాదు సుమా.. తాజాగా ఇరుగు పొరుగున ఉంటున్న 12 ఏళ్ల బాలుడిని తీసుకుని మరీ వెళ్లిపోయింది.

By:  Tupaki Desk   |   10 Oct 2024 4:30 PM GMT
12 ఏళ్ల అబ్బాయితో 15 ఏళ్ల బాలిక జంప్... ఇది మూడోసారంట!
X

డైరెక్ట్ గా విషయంలోకి వెళ్లిపోతే... ఓ 15 ఏళ్ల బాలిక అటు తల్లితండ్రులను, ఇటు పోలీసులను కూడా ముప్పుతిప్పలు పెట్టించేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు మూడోసారి ఇంటి నుంచి పారిపోయింది. అలా అని ఒంటరిగా కాదు సుమా.. తాజాగా ఇరుగు పొరుగున ఉంటున్న 12 ఏళ్ల బాలుడిని తీసుకుని మరీ వెళ్లిపోయింది.

అవును... ఉత్తరప్రదేశ్ లోని నొయిడా పోలీసులను 15 ఏళ్ల బాలిక ఇబ్బంది పెడుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, మూడోసారి ఇంటి నుంచి పారిపోయింది. గతంలో కూడా ఓ రెండు సార్లు ఇలానే పారిపోతే.. వెతికి తీసుకొచ్చారు పోలీసులు. ఇప్పుడు మూడోసారి కూడా పారిపోవడంతో ఈమె వ్యవహారం ఇంటా బయటా పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... నొయిడాలోని సెక్టార్ 58లో ఉన్న బిషన్ పురా గ్రామంలోని దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమర్తె వయసు 15 ఏళ్లు కాగా.. చిన్న కుమార్తె వయసు 12 ఏళ్లు. ఈ కుటుంబం బీహార్ లోని దర్భంగాకు చెందినది. ఈ సమయంలో పిల్లల చదువుకోసం అని ఆ దంపతులు బిషన్ పురాలో అద్దెకు గది తీసుకుని ఉంటున్నారు.

దంపతులు ఇద్దరూ ఓ ప్రైవేటు కంపెనీలో ఇద్దరూ ఉద్యొగం చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పెద్ద కుమార్తె పొరుగున నివసిస్తున్న మరో ఇద్దరు మైనర్ బాలికలను వెంటబెట్టుకుని ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో పోలీసులు సుమారు వారం పాటు సెర్చ్ చేసి బాలికను పట్టుకున్నారు.

ఆ సమయంలో బాలిక ఇంటి నుంచి రూ.50 వేలు తీసుకెళ్లిందని చెబుతున్నారు. ఇలా రెండు సార్లు జరగగా... తాజాగా మరోసారి ఆ బాలిక కనిపించకుండా పోయిందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు! ఈమె ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి నొయిడా వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో ఆటో తీసుకొచ్చేందుకు మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లాడు.

ఆ సమయంలో ఇంట్లో భార్య, చిన్న కూతురూ సామాన్లు సర్ధుతున్నారు. ఈ సమయంలో పెద్ద కూతురు కనిపించకుండా పోయింది. దీంతో... మరోసారి ఇంట్లో నుంచి పారిపోయిందని ఫిక్సైన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అదే సమయంలో పొరుగున ఉన్న 12 ఏళ్ల బాలుడు కూడా కనిపించడం లేదు!

దీంతో... ఆ బాలుడిని తీసుకుని ఈ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటుందని గతానుభవాల దృష్ట్యా భావిస్తున్నారు. ఈ సమయంలో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఏడీసీపీ తెలిపారు.