Begin typing your search above and press return to search.

అనూహ్యం.. ఒత్తిడితో మహిళా సీఏ మృతి.. దర్యాప్తుకు కేంద్రం ఆదేశం

ఇప్పుడు ఇదే అంశం ఏకంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తునకు వెళ్లింది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 10:28 AM GMT
అనూహ్యం.. ఒత్తిడితో మహిళా సీఏ మృతి.. దర్యాప్తుకు కేంద్రం ఆదేశం
X

ఉద్యోగ బాధ్యతలో అధిక ఒత్తిళ్లు.. అత్యధిక పనివేళలు.. ఇది చాలా సహజంగా చర్చకు వస్తున్న అంశం. సాంకేతికత ఎంత పెరిగినా మనుషుల మీద ఒత్తిడి తగ్గడం లేదనేది స్పష్టం అవుతోంది. ఇటీవలి కాలంలో ఉద్యోగులు పనిచేస్తూనే కుప్పకూలుతున్న ఉదాహరణలను చూస్తున్నాం.. మరికొందరు యువకులు కూడా హఠాత్తుగా అస్వస్థతకు గురవడాన్ని గమనిస్తున్నాం. ఇక బహుళ జాతి సంస్థ (ఎంఎన్ సీ)లలో అయితే ఒత్తిడి మరో విధంగా ఉంటుంది. టార్గెట్లు.. బాస్ ల వేధింపులు.. కొత్తకొత్త ఐడియాలు.. ఇలా ఒత్తిడి కనిపించని రీతిలో ప్రభావం చూపుతుంటుంది. ఇప్పుడు ఇదే అంశం ఏకంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తునకు వెళ్లింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

‘యంగ్’లో.. 26 ఏళ్లకే కుప్పకూలి..

యెర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) పెద్ద బహుళజాతి సంస్థ. ఇందులో పనిచేస్తోంది 26 ఏళ్ల యువతి. ఆమె పేరు అన్నా సెబాస్టియన్ పెరియాళి. ప్రొఫెషన్ రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన అన్నా.. అనూహ్యంగా చనిపోయింది. దీనికి పని ఒత్తిడే కారణం అంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ స్పందించింది. అన్నా కేరళకు చెందినవారు. ఈమె జూలైలో చనిపోయింది. దానికి సంబంధించి దర్యాప్తు చేయిస్తామని కేంద్ర ప్రభుత్వ ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కర్లాంద్లజె తెలిపారు. అన్నా మరణం తనను కలచివేసిందని చెప్పిన శోభ.. ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని ప్రకటించారు.

కార్యాలయంలోనే..

కేరళలో కొచికి చెందిన అన్నా.. యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియా సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ లో ఉద్యోగి. జూలై 20న ఆమె పుణెలోని సంస్థ కార్యాలయంలో ఉద్యోగ విధుల్లో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. సహోద్యోగులు ఆస్పత్రికి తీసుకెళ్లిన కాసేపటికే చనిపోయింది. అయితే, అన్నా మరణానికి పని ఒత్తిడే కారణమంటూ ఆమె తల్లి అనితా ఆరోపించారు. ఇటీవల అన్నా పనిచేస్తున్న సంస్థ ఈవై ఇండియా అధిపతికి లేఖ రాశారు. దీంతో మొత్తం విషయం బయటపడింది. కేరళ బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ స్పందిస్తూ.. అనితాన ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు. అందుకే శోభ ట్వీట్ చేస్తూ హామీ ఇచ్చారు.

చేరిన 4 నెలలకే.. అంత్యక్రియలకు రాకపోవడంతో..

అన్నా.. ఈవై సంస్థలో చేరిన నాలుగు నెలలకే చనిపోయారు. ఆమె మార్చిలో ఈవైలో ఉద్యోగంలో చేరారు. ఇదే విషయాన్ని చెబుతూ తల్లి అనితా.. సంస్థలో పని ఒత్తిడి తన కుమార్తె ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు. ఉద్యోగంలో అన్నా ఎదుర్కొన్న పరిస్థితులను ప్రస్తావించారు. అంతేగాక ఆమె అంత్యక్రియలకు ఈవై తరఫున ఎవరూ హాజరుకాకపోవడంతో అనిత క్షోభకు గురయ్యారు. ఆ సంస్థలో ఇతర ఉద్యోగులకు ఈ పరిస్థితి రాకూడదంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశఆరు. అయితే, అన్నా మరణం తమను తీవ్రంగా బాధించిందని యర్నెస్ట్‌ సంస్థ ప్రకటన విడుదల చేసింది.