ఆధార్ నుంచి ఆసక్తికరమైన అప్ డేట్... చర్చ స్టార్ట్!
అవును... ఆధార్ కార్డు పౌరసత్వానికి ఆధారం కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) కోల్ కతా హైకోర్టుకు తెలిపింది.
By: Tupaki Desk | 7 July 2024 6:01 AM GMTతాజాగా ఆధార్ కార్డుకి సంబంధించి ఆసక్తికర అప్ డేట్ తెరపైకి వచ్చింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కోల్ కతా హైకోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా చట్టబద్ధంగా భారత్ లోకి ప్రవేశించిన నాన్ రెసిడెంట్లు కూడా ఆధార్ కు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆధార్ పొందవచ్చని యూఐడీఏఐ పేర్కొంది. తాజాగా ఈ విషయం ఆసక్తికరంగా మారింది.
అవును... ఆధార్ కార్డు పౌరసత్వానికి ఆధారం కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) కోల్ కతా హైకోర్టుకు తెలిపింది. చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించిన నాన్ రెసిడెంట్లు ఈ మేరకు ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. ఆధార్ పొందవచ్చని యుఐడీఏఐ పేర్కొంది. వెస్ట్ బెంగాల్ లో అనేక ఆధార్ కార్డులను అకస్మాత్తుగా డీయాక్టివేట్ చేయడం, తిరిగి యాక్టివేట్ చేయడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివగణం, జస్టిస్ హిరణ్ మోయ్ భట్టాచార్యలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఈ మేరకు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా స్పందించిన యూఐడీఏఐ... పౌరసత్వంతో ఆధార్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇది దేశంలో ఓ వ్యక్తి నివాస ప్రాంతాన్ని ధ్రువీకరించేది మాత్రమేనని స్పష్టం చేసింది.
ఈ సమయంలో ఆధార్ నిబంధనల్లోని 28 ఏ (ఎ), 29 నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును పిటిషనర్ తరుపు న్యాయవాది సవాల్ చేశారు. ఇదే సమయంలో... ఆధార్ చాలా పెద్ద విషయమని.. పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆధార్ అవసరమని.. జనన ధృవీకరణ పత్రం ఆధార్ తప్పనిసరని.. దేశంలో జననం నుంచి మరణం వరకు అన్నీ ఆధార్ తో ముడిపడి ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
మరోపక్క యూఐడీఏఐ తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది... పిటిషనర్ల హక్కులను సవాల్ చేశారు. తమది అన్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ అని, అలాంటి వాదనను అంగీకరించబోమని, అసలు ఆధార్ కార్డులకు, పౌరసత్వానికీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ప్రభుత్వ రాయితీలు పొందేందుకు విదేశీ పౌరులకు కూడా ఈ ఆధార్ ను నిర్ణీత సమయం వరకూ ఇవ్వొచ్చని తెలిపారు.