Begin typing your search above and press return to search.

ఆధార్ కార్డ్ పోయిందా .. కంగారెందుకు ?

UIDAI వెబ్‌సైట్‌ విజిట్ చేసి ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ID ఎంటర్ చేయాలి. అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

By:  Tupaki Desk   |   11 May 2024 4:28 AM GMT
ఆధార్ కార్డ్ పోయిందా .. కంగారెందుకు ?
X

ఆధార్ కార్డ్. ఇప్పుడు అన్నిచోట్లా ఇదే గుర్తింపు కార్డు. ఆధార్ కార్డ్ పోయిందంటే మనం గాబరాపడిపోవడం సహజం. ఆధార్ కార్డ్ కోసం నెట్ సెంటర్ల వైపు పరుగెత్తడం సహజం. అలా నెట్ సెంటర్ల వైపు పరుగులు పెట్టకుండా కూల్ గా మీరు మీ మొబైల్ ఫోన్లోనే మీ ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా ? తెలియకుంటే తెలుసుకోండి. ఈ డిజిటల్ కాపీ ఫిజికల్ ఆధార్ కార్డులా అన్ని సేవలకు చెల్లుబాటు అవుతుంది.

UIDAI వెబ్‌సైట్‌ విజిట్ చేసి ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ID ఎంటర్ చేయాలి. అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీంతో గుర్తింపును నిర్ధారించుకోవాలి. తర్వాత ఈ-ఆధార్‌ను PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పాలీ వినైల్ క్లోరైడ్ (PVC)తో తయారు చేసే కార్డు. ఇది క్రెడిట్ కార్డు లాగానే కనిపిస్తుంది. దానిపై ఆధార్ వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఇంటికే డెలివరీ రూపంలో దీనిని అందుకోవాలంటే రూ.50 రుసుము చెల్లించాలి.

UIDAI వెబ్‌సైట్‌‌లోకి వెళ్లాలి లేదా ఎంఆధార్ (mAadhaar) యాప్‌ డౌన్‌లోడ్ చేయాలి. ఈ ఫిజికల్ కార్డు పొందాలంటే ఆధార్ నంబర్, ఎన్‌రోల్‌మెంట్ ID లేదా వర్చువల్ IDని సిద్ధంగా ఉంచుకోవాలి. నిర్ధారించడం కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆర్డర్ చేయడానికి ఆన్‌ స్క్రీన్‌ సూచనలను ఫాలో అవ్వాలి. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత వారం రోజులలో కార్డు మీ ఇంటికి చేరుతుంది.