టీవీ షోతోనే రూ.2200 కోట్లు సంపాదించిన మన స్టార్ హీరో తెలుసా?
ప్రస్తుతం ఇండియాలో భాషతో సంబంధం లేకుండా ఏ స్టార్ హీరో నటించిన సినిమా అయినా గ్లోబల్ మార్కెట్ ను టచ్ చేస్తోన్న పరిస్థితి.
By: Tupaki Desk | 9 Oct 2024 12:30 AM GMTప్రస్తుతం భారతదేశ సినిమా స్థాయి, వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. రీజనల్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా మారగా.. పాన్ ఇండియా సినిమాలు ఇంటర్నేషనల్ సినిమాలుగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో భాషతో సంబంధం లేకుండా ఏ స్టార్ హీరో నటించిన సినిమా అయినా గ్లోబల్ మార్కెట్ ను టచ్ చేస్తోన్న పరిస్థితి.
దీంతో స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ భారీగా పెరుగుతున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో సినిమాకు పెట్టే పెట్టుబడి, కలెక్షన్ కూడా భారీగా మారాయి! ఈ సమయంలో సినిమాలతో సంబంధం లేకుండా.. కేవలం టీవీ షో ద్వారానే ఊహించని భారీ మొత్తన్ని సంపాదించారు భారతదేశంలోని ఓ స్టార్ హీరో.
అవును... భారత్ లోని ప్రముఖ హీరోల్లో ఒకరు సినిమాలతో సంబంధం లేకుండా టీవీ షో ద్వారానే చాలా మంది ఊహించలేని భారీ మొత్తాన్ని సంపాదించారు. ఆ నటుడు మరెవరో కాదు.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు సంపాదించుకున్న మోస్ట్ టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. ఈ ఘనత ఈ బహుముఖ ప్రజ్ఞాశాలికి సాధ్యమైంది!
అమీర్ ఖాన్ కొన్నాళ్ల క్రితం ఓ టీవీ షోను హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాని పేరు.. "సత్యమేవ జయతే"! ఇది భారతదేశంలో ఉన్న సమాజిక సమస్యలపై చర్చించే కార్యక్రమం కాగా... ఈ షో ద్వారా 2013లో టైమ్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితమైన 100 మంది వ్యక్తుల జాబితాలో చేరారు.
ఈ క్రమంలో సత్యమేవ జయతే మూడో సీజన్ కు అమీర్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత ఓ ఎపిసోడ్ లో రెజ్లర్లు గీతా ఫోగట్, బబితా ఫోగట్ లను పరిచయం చేశారు. ఆ అమ్మాయిలు ఎదుర్కొన్న పోరాటాలను, సవాళ్లను ఎలా అధిగమించి చరిత్ర సృష్టించారో అమీర్ పంచుకున్నారు.
వారి జీవితాల చుట్టూ తిరిగే కథనే సినిమాగా తెరకించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన "దంగల్". వాస్తవానికి ఆ ఎపిసోడ్ నుంచే అమీర్ కు దంగల్ అనే సినిమా ఆలోచన వచ్చిందట. 2016లో ఈ సినిమా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కలెక్షన్స్ సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి!
ఇందులో భాగంగా ఆ సినిమా విడుదలైన 11 రోజుల్లో సుమారు రూ.375 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా రూ.2,207 కోట్లు పైగా కలెక్ట్ చేసింది! ఫలితంగా... అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఇలా రూ.2,200 కోట్లకు పైగా వసూలు చేయడానికి టీవీ షోనే కారణమైందని చెబుతారు!