Begin typing your search above and press return to search.

పోస్టింగ్ రోజే రిటైర్మెంట్...అంతా ఆయన చేతుల్లోనే !?

ఆయన టీడీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా వ్యవహరించారు.

By:  Tupaki Desk   |   30 May 2024 2:03 PM GMT
పోస్టింగ్ రోజే రిటైర్మెంట్...అంతా ఆయన చేతుల్లోనే !?
X

ఏపీలో ఏబీ వెంకటేశ్వరరావు అనే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన గత టీడీపీ ప్రభుత్వంలో ఒక వెలిగారు. అదే ఆయన మరో అయిదేళ్ళ సర్వీస్ కెరీర్ ని ఇబ్బందుల పాలు చేసింది అని అంటారు. ఆయన టీడీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా వ్యవహరించారు.

అప్పట్లో ఆయన విపక్ష వైసీపీని టార్గెట్ చేశారు అన్న ప్రచారం సాగింది. ఆ మీదట అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏబీని పక్కన పెట్టింది. అంతే కాదు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు సస్పెన్షన్ కి కూడా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గురి అయ్యారు. అయితే ఆయన తన పోస్టింగ్ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఆయన సర్వీస్ చిట్ట చివరి రోజుకు వన్ డే బిఫోర్ అంటే గురువారం ఏపీ హైకోర్టులో ఏబీకి భారీ ఊరట లభించింది.

ఈ మేరకు హైకోర్టు క్యాట్ ఉత్తర్వుల ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని అదే విధంగా ఆయనకు జీతభత్యాలు చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే ఇంత పోరాటం చేసి హైకోర్టులో ఊరట పొందినా కూడా ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారమే రిటైర్ కానున్నారు. అంటే మే 31వ తేదీ అన్న మాట.

దాంతో హైకోర్టు ఉత్తర్వులు ఇపుడు కీలకంగా మరాయి. ఏబీ అంశంలో ఏమి జరుగుతుంది అన్నది కూడా అత్యంత ప్రాధాన్యత గా మారింది. ఇదిలా ఉండగా హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని కలిశారు.

క్యాట్ ఉత్తర్వులతో పాటు తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని తనకు పోస్టింగ్ ఇవ్వాలని సీఎస్ ను ఏబీ కోరారు. ఏబీ వెంకటేశ్వరరావు నుంచి క్యాట్ ఉత్తర్వులు హైకోర్టు తీర్పు కాపీని అందుకున్న సీఎస్ జవహర్ రెడ్డి తాను ఈ అంశాన్ని పరిశీలిస్తానని చెప్పినట్లుగా భోగట్టా.

అయితే ఈ విషయంలో సీఎస్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది చర్చకు వస్తున్న విషయం. ఒకవేళ ఏపీకి పోస్టింగ్ ఇస్తే ఆయన శుక్రవారం మార్నింగ్ జాయిన్ అయి సాయంత్రానికి పదవీ విరమణ చేస్తారు. అలా జరిగితే ఇది ఒక రికార్డు అవుతుంది.

అలా కాదు అనుకుంటే తన పోస్టింగ్ కోసం అయిదేళ్ల పాటు పోరాడి చివరికి పోస్టింగ్ దక్కించుకోలేక రిటైర్మెంట్ అయిన రికార్డు కూడా ఏబీకే దక్కుతుంది. ఏది ఏమైనా ఏబీ ఇష్యూ అన్నది ఎప్పటికీ ఏపీ ఉన్నతాధికారుల సర్వీస్ మ్యాటర్ లో గుర్తుండిపోయేదే అవుతుంది అని అంటున్నారు. మరి దీని మీద సీఎస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అన్న దాని బట్టే ఏబీ రికార్డు అన్నది ఆధారపడి ఉంది అంటున్నారు.