Begin typing your search above and press return to search.

కాలేశాడు, కేసు పెట్టారు... ఆసిస్ క్రికెటర్ పై భారత్ లో ఎఫ్.ఐ.ఆర్.!

ఈ సమయంలో నిర్లక్ష్యమో.. బలుపో.. ప్రపంచం తమ పాదాల కింద ఉందని చెప్పే ఉద్దేశ్యమో తెలియదు కానీ... ఆసిస్ క్రికెటర్ ఒక బలుపు పని చేశాడు!

By:  Tupaki Desk   |   24 Nov 2023 5:54 AM GMT
కాలేశాడు, కేసు పెట్టారు... ఆసిస్  క్రికెటర్  పై భారత్  లో ఎఫ్.ఐ.ఆర్.!
X

వరల్డ్ కప్ ఫైనల్ లో టీం ఇండియా ఓటమి పాలైంది. దీంతో కోట్ల మంది భారతీయులు ఆ సమయంలో ఆవేదనతో ఉన్నారు. ఈ సమయంలో నిర్లక్ష్యమో.. బలుపో.. ప్రపంచం తమ పాదాల కింద ఉందని చెప్పే ఉద్దేశ్యమో తెలియదు కానీ... ఆసిస్ క్రికెటర్ ఒక బలుపు పని చేశాడు! అందులో భాగంగా చేతిలో బీరు పట్టుకుని, వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టి, సోఫాలో దర్జాగా కూర్చుని ఫోటోకు ఫోజిచ్చాడు.

ఆ సమయమంలో ఆ ఫోటో వైరల్ అయ్యింది. దీనిపై సగటు భారతీయులందరూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇది పూర్తి బలుపు యవ్వారం అంటూ కామెంట్లు పెట్టాడు. విలువ ఇవ్వని వారికే విలువైనవి దక్కుతుంటాయి ఏమిటో అంటూ స్పందించారు. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. తాజాగా ఆస్ట్రేలియా ఆల్‌ రౌండర్ మిచెల్ మార్ష్ మీద మనదేశంలో ఎఫ్.ఐ.ఆర్. నమోదైంది.

అవును... ప్రపంచ కప్ మీద కాళ్లు పెట్టి, బలుపు ప్రదర్శించి, కోట్ల మంది భారతీయుల మనోభావాలను కించపరిచిన విషయంపై మార్ష్ పై కేసు నమోదైంది. ఈ మేరకు యూపీలోని అలీఘర్‍ కు చెందిన పండిట్ కేశవ్ అనే వ్యక్తి మిచెల్ మార్ష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ఈ ఆసిస్ ఆల్ రౌండర్ మీద మీద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు.

పండిట్ కేశవ్ ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్‌ లో మిచెల్ మార్ష్ మీద లిఖిత పూర్వక ఫిర్యాదుచేశారు. దీనికి సంబంధించిన ఫోటోతో సదరు క్రికెటర్ భారతీయ భావోద్వేగాలను కించపరిచారని.. వరల్డ్‌ కప్ మీద కాళ్లు ఉంచడం ద్వారా ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని అవమానించాడని.. దీంతో పాటుగా 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని కూడా అగౌరవపరిచాడని ఫిర్యాదులో ఆరోపించారు.

ఇదే సమయంలో... మిచెల్ మార్ష్ భారత్‍‍ లో ఆడకుండా, అలాగే భారతదేశంపై ప్రపంచంలో ఎక్కడా ఆడుకుండా జీవితకాల నిషేధం విధించాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా డిమాండ్ చేస్తూ ఫిర్యాదు కాపీని ప్రధాని నరేంద్రమోడీ, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ కార్యాలయాలకు సైతం పంపించారు. దీంతో ఆ ఫోటో కంటే ఇప్పుడు ఈ ఇష్యూ వైరల్ అయ్యింది.

కాగా.. వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ లో టీం ఇండియా మీద విజయం సాధించి ఆస్ట్రేలియా ప్రపంచకప్ కైవసం చేసుకున్న తర్వాత... డ్రెస్సింగ్ రూంలో ఆ ట్రోఫీ మీద కాళ్లు ఉంచి మిచెల్ మార్ష్ ఫోటోకి ఫోజు ఇచ్చాడు. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. ఓ చేతిలో బీరు బాటిల్ పట్టుకుని .. కాళ్లను వరల్డ్‌ కప్ ట్రోఫీ మీద ఉంచి మార్ష్ ఇచ్చిన ఫోజు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే భారత్ లో ఎఫ్.ఐ.ఆర్. నమోదైంది!