ఏపీలో కొత్త అరాచకం.. యాసిడ్ దాడి.. సీఎం సీరియస్
ఏపీలో ఇప్పటికే గంజాయి, మద్యం మత్తులో జరుగుతున్న అఘాయిత్యాల గురించి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం కలత చెందుతోంది.
By: Tupaki Desk | 30 Nov 2024 9:29 AM GMTఏపీలో ఇప్పటికే గంజాయి, మద్యం మత్తులో జరుగుతున్న అఘాయిత్యాల గురించి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం కలత చెందుతోంది. వీటిని కట్టడి చేసేందుకు `ఈగల్` అనే నూతన వ్యవస్థను కూడా తీసుకు వచ్చింది. త్వరలోనే ఈగల్ కార్యాలయాల ద్వారా మత్తు వదిలించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా వుంటే.. తాజాగా మరో అరాచకం తెరమీదికి వచ్చింది. ఒకప్పుడు ఎప్పుడో జరిగి, తర్వాత ఆగిపోయిన యాసిడ్ దాడులు మరోసారి ముందుకువ చ్చాయి.
తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఈ యాసిడ్ దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విశాఖప ట్నంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి ఒకరు యాసిడ్ దాడి చేశారు. కంచర్ల పాలెం నుంచి గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణి స్తున్న ముగ్గురు మహిళలు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో వారు ఒక్కసారి అరుపులు కేకలు పెట్టడంతో బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, స్థానికుల సాయంతో బాధితులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న కంచర పాలెం సీఐ చంద్రశేఖర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దాడిలో ఉపయోగించింది యాసిడ్డా? ఇతర ద్రావణమా అనే దానిపై పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ దాడి వెనుక కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదిలావుంటే.. ఈ ఘటనను రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దశాబ్ద న్నర కిందటే రాష్ట్రంలో ముగిసిపోయిందని భావించిన యాసిడ్ దాడులు ఇప్పుడు మళ్లీ ప్రారంభం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన బాద్యులను గుర్తించి.. అరెస్టు చేయాలని ఆదేశించారు. కాగా, సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై సీరియస్ అయినట్టు తెలిసింది. ఎలా జరిగిందో తెలుసుకుని విచారణను ముమ్మరం చేయాలని సూచించారు.