ఇండిగో విమానంలో ఏసీ బంద్... ప్రయాణికుల పరిస్థితి ఇది!
ఈ మధ్యకాలంలో విమానాల్లో జరుగుతున్న అనేక రకాల సమస్యలు, అసౌకర్యాలు.. ఫలితంగా వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 Aug 2023 11:34 AM GMTఈ మధ్యకాలంలో విమానాల్లో జరుగుతున్న అనేక రకాల సమస్యలు, అసౌకర్యాలు.. ఫలితంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రెగ్యులర్ గా వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా విమానంలో ఏసీ బంద్ అయిపోయిన సంఘటన తెరపైకి వచ్చింది. దీంతో ప్రయాణికులకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది.
అవును... ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ కండిషన్ ఆన్ కాకముందే విమానం గాల్లోకి ఎగిరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... చండీగఢ్ నుంచి జైపుర్ కు ఇండిగో విమానం (6E7261) టేకాఫ్ అయ్యింది. ఏసీలు ఆన్ చేయకుండానే విమానం బయల్దేరింది. సరే ఇప్పుడైనా ఆన్ అయిపోద్దిలే అని చూస్తున్న ప్రయాణికులకు ల్యాండిగ్ వరకు ఏసీని ఆన్ చేయలేదు. దీంతో ప్రయాణికులు చాలా అవస్థపడ్డారు.
వేడికి తట్టుకోలేక చల్లగా ఉండేందుకు కాగితాలతో కొంతమంది విసురుకొన్నారు. ప్రయాణికులు చెమటను తుడుచుకోవటానికి ఎయిర్ హోస్టెస్ టిష్యూ పేపర్లను ఉదారంగా అందించింది. ఈ విషయాలను అమరీందర్ సింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే ఆ విషయం గురించి ఎవరూ విమాన సిబ్బంది వద్ద ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు.
అయితే తాజాగా ఈ వీడియోను పౌర విమాన సర్వీసుల నియంత్రణ సంస్థ డీజీసీఏకు, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ట్యాగ్ చేస్తూ.. ఇండిగో ఎయిర్ లైన్స్ తోపాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమరీందర్ కోరారు. ఇదిలా ఉండగా.. ఒక్క రోజులో మూడు ఇండిగో విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం గమనార్హం.
అవును... ఏసీలు పనిచేయకుండా ఒక విమానం ప్రయాణిస్తే... మరోపక్క ఢిల్లీ నుంచి పట్నాకు బయల్దేరిన విమానంలో టేకాఫ్ అయిన మూడు నిమిషాల వ్యవధిలోనే సాంకేతిక లోపంతో అత్యవసరంగా వెనక్కు మళ్లింది. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి రాంచీకి బయల్దేరిన మరో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్యను ఎదుర్కొంది.