Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు... కరప్షన్ కి కారకులు ప్రజలే!

అవును... ఒంగోలులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సినీనటుడు సుమన్... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   1 April 2024 7:20 PM GMT
ఎన్నికల వేళ సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు... కరప్షన్ కి కారకులు ప్రజలే!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ డబ్బు అనే సబ్జెక్ట్ కీలక భూమిక పోషిస్తుంటుందని అంటారు! ఇదే సమయలో... ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని నాయకులు ఆఫ్ ద రికార్డ్ చెబుతుంటారని అంటుంటారు. ఈ సమయంలో సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. పాలిటిక్స్ లో కరప్షన్ కి కారణం ప్రజలే అని.. ఇండియాలో సెక్యులర్ అనేదే రిలీజియన్ గా ఉండాలని తెలిపారు.

అవును... ఒంగోలులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సినీనటుడు సుమన్... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా... ఎన్నికల్లో కరప్షన్, సెక్యులరిజం మొదలైన విషయాలపై వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో... రాజకీయ నాయకులు దొంగలు అని ప్రజలు తిడుతున్నారని చెప్పిన సుమన్... అయితే, రాజకీయ నాయకులను అవినీతిపరులను చేసింది ప్రజలే అని అన్నారు.

ప్రజలు అన్ని పార్టీల దగ్గరా డబ్బులు తీసుకుంటున్నారని.. తర్వాత ఒకరిని సెలక్ట్ చేసుకుని ఓటు వేస్తున్నారని.. అయితే ఓటు వేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని స్పష్టం చేశారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా... వ్యక్తిని చూసి ఓటు వేయాలని, గెలిచిన తర్వాత వారు అటు వీరు ఇటు మారిపోతున్నారని.. ఎన్నికలు అయిన తర్వాత చాలా జరుగుతాయని తెలిపారు.

ఇదే క్రమంలో... దేశంలో హిందూ, ముస్లిం, క్రీస్టియన్ అనే తారతమ్యాలు ఉండకూడదని.. సెక్యులర్ అనేదే ఇక్కడ రిలీజియన్ గా ఉండాలని తెలిపారు. తాను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నానంటే... అన్ని మతాలవారూ కారణం అని స్పష్టం చేశారు. తాను సెక్యులరిజాన్ని నమ్ముతానని.. సెక్యులర్ గానే ఉంటానని.. అలా ఆలోచించేవారికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు!

ప్రధానంగా మహిళలకు రక్షణ ఉండాలని సుమన్ తెలిపారు. చిన్న చిన్న పిల్లలపై అత్యాచారలు చేసున్నవారు జీవితాంతం జైల్లోనే ఉండే విధంగా చట్టాలు మారాలని స్పష్టం చేశారు.