విశాల్ కు ఎదురైన బాబు అరెస్ట్ ప్రశ్న... రియాక్షన్ ఇదే!
సినిమా ప్రచారాల నిమిత్తం హైదరాబాద్ వచ్చిన విశాల్... చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి ప్రశ్నను ఎదుర్కొన్నారు.
By: Tupaki Desk | 20 Sep 2023 11:46 AM GMTప్రస్తుతం ఏ సినిమా ప్రెస్ మీట్ జరిగినా, ప్రమోషన్ కార్యక్రమం జరిగినా ఆయా నటులు, నిర్మాతలకు రొటీన్ గా ఒక ప్రశ్న ఎదురవుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా వారు చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించిన ప్రశ్నను కచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు విశాల్ వంతు వచ్చింది.
అవును... నటుడు విశాల్ తాజాగా "మార్క్ ఆంటోనీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎస్ జె సూర్య కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రచారాల నిమిత్తం హైదరాబాద్ వచ్చిన విశాల్ ను... జగన్ ఫ్యాన్ అయిన మీరు చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి స్పందించాలని జర్నలిస్టులు కోరారు.
దీంతో.. ఆ ప్రశ్నకు సమాధానంగా స్పందించిన విశాల్... "చంద్రబాబు గారిని పోలీస్ డిపార్ట్ మెంట్ అరెస్టు చేశారు.. రిమాండ్ కి పెట్టారు.. ఒక కేసుకు సంబంధించిన విషయం ద్వారా రిమాండ్ చేశారు.. నిజాయితీగా చెప్పాలంటే నాకు నచ్చిన పాలిటిషియన్ (జగన్) అయినా నేను ఇక్కడ ఓటు వేయలేదు. తమిళనాడులో వేశాను”అని చెప్పారు.
అనంతరం... ఒక వ్యక్తిగా నేను చూసినప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే తప్పలేదు అన్నప్పుడు.. సామాన్యుడినైన నాకు భయమేస్తుంది అని విశాల్ రియాక్ట్ అయ్యారు! దీంతో... చంద్రబాబుకే తప్ప లేదు.. తప్పుచేస్తే సామాన్యుడినైన నా పరిస్థితి ఏమిటనే భయం వేసిందన్నట్లుగా విశాల్ స్పందించారని అంటున్నారు పరిశీలకులు.
నిజాయితీగా చెప్పాలంటే తాను సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నానని చెప్పిన ఆయన... అల్టిమేట్ గా న్యాయమే గెలుస్తుంది అని అన్నారు. ఇదే సమయంలో "మేము స్క్రీన్ మీద కనిపిస్తాం.. కానీ ఇంటికి వెళ్ళగానే మేము కూడా సామాన్యులమే" అని చెప్పిన విషాల్... “అల్టిమేట్ గా న్యాయం గెలుస్తుంది”అని పునరుధ్గాటిస్తూ ముగించారు!
కాగా ఇప్పటివరకూ చంద్రబాబు అరెస్ట్ పై రాఘవేంద్ర రావు, అశ్వనీదత్, నట్టి కుమార్, కేఎస్ రామారావు, బండ్ల గణేష్ లు స్వచ్చందంగా రియాక్ట్ అవ్వగా... నిర్మాత సురేష్ బాబు, హీరో విశాల్ లు మీడియా అడిగిన ప్రశ్నలకు రియాక్ట్ అవుతూ... తమదైన శైలిలో సమాధానం ఇచ్చారు!