Begin typing your search above and press return to search.

స్వ‌లింగ వివాహం.. సుప్రీం తీర్పుపై న‌టి నిరాశ‌!

విరుద్ద జంట‌ల‌కు క‌ల్పించే ప్రయోజ‌న‌లు..హ‌క్కుల‌ను ప‌రిశీలించేందుకు క‌ట్టుబ‌డ ఉన్ఆమంటూ సుప్రీం స్టేట్ మెంట్ రికార్డు చేయ‌డాన్ని సానుకూలంగా సెలీనా పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 12:48 PM GMT
స్వ‌లింగ వివాహం.. సుప్రీం తీర్పుపై న‌టి నిరాశ‌!
X

స్వ‌లింగ వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించేందుకు సుప్రీకోర్టు నిరాక‌రిస్తూ తీర్పునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యాన్ని పార్ల‌మెంట్ అభీష్టానికే వదిలేసంది. తాజాగా ఈ తీర్పుపై బాలీవుడ్ న‌టి సెలీనా జైట్లీ నిరాశను వ్యక్తం చేసింది. త‌న అభిప్రాయాన్ని సెలీనా నిర్మొహ‌మాటంగా తెలియ‌జేసింది.


`వివాహంపై తీర్పు నిజంగా నిరాశను కలిగించింది. ఎల్ జీబీటీ కమ్యూనిటీ భిన్నమైన హక్కులను ఏమీ కోరడం లేదు. ప్రతీ ఒక్క భారత పౌరుడికి ఉన్న హక్కులనే వారు కూడా కోరుతున్నారు. గత 20 ఏళ్ల నుంచి ఎల్ జీబీటీ కార్యకర్తగా ఉన్న నేను ఇది చెప్పదలుచుకున్నాను. వివాహం చేసుకోవడం, కుటుంబాన్ని కలిగి ఉండడం అన్నది మనిషికి ఉండాల్సిన చాలా ముఖ్యమైన హక్కు. దీనిపై పార్లమెంట్ అయినా ప్రత్యేక వివాహ చట్టం తీసుకొస్తుందని.. లింగ సమానత్వం కల్పిస్తుందని ఆశిస్తున్నాను` అని అన్నారు.

విరుద్ద జంట‌ల‌కు క‌ల్పించే ప్రయోజ‌న‌లు..హ‌క్కుల‌ను ప‌రిశీలించేందుకు కట్టుబడి ఉన్నామని సుప్రీం స్టేట్ మెంట్ రికార్డు చేయ‌డాన్ని సానుకూలంగా సెలీనా పేర్కొన్నారు. అలాగే `బదానీ` సినిమాలో లెస్బియన్ పాత్ర పోషించిన భూమి పెడ్నేకర్ కూడా ఇన్ స్టా గ్రామ్ లో స్పందించింది. `స్వలింగ వివాహాలకు ఆమె ఎప్పటి నుంచో మద్దతు పలుకుతోంది. సుప్రీంకోర్టు తీర్పు అంశాలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసింద‌ని రాసుకొచ్చారు.

ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. కొంత మంది సుప్రీం తీర్పుకు మ‌ద్ద‌తు ప‌ల‌కగా మ‌రికొంత మంది వ్య‌తిరేక‌త‌ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇక న‌టి సెలీనా మూడేళ్ల‌గా ఎలాంటి సినిమాలు చేయ‌లేదు. వెండి తెర‌కు దూరంగా ఉంటున్నారు. ఈ గ్యాప్ ఆమె కావాల‌ని తీసుకున్నారా? అవ‌కాశాలు రాక ఖాళీగా ఉంటున్నారా? అన్న‌ది క్లారిటీ లేదు. భూమీ ప‌డ్నే క‌ర్ మాత్రం బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది.