Begin typing your search above and press return to search.

"గగన్‌ యాన్" వ్యోమగామిని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి!

అవును... "గగన్ యాన్" వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ ని తాను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది ప్రముఖ మలయాళ నటి లీనా

By:  Tupaki Desk   |   28 Feb 2024 5:54 AM GMT
గగన్‌ యాన్ వ్యోమగామిని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి!
X

ఇప్పటికే చంద్రయాన్, ఆధిత్య మిషన్ ప్రయోగాలతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ఇస్రో.. ఈసారి మనవసహిత అంతరిక్ష యాత్ర "గగన్ యాన్"కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతరిక్షంలోకి వెళ్లబోతున్న నలుగురు వ్యోమగాముల పేర్లను పరిచయం చేశారు. వారిలో ఒకరైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆయనను పెళ్లి చేసుకున్నట్లు ప్రముఖ నటి వెల్లడించింది.

అవును... "గగన్ యాన్" వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ ని తాను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది ప్రముఖ మలయాళ నటి లీనా. భారత తొలి మానసహిత అంతరిక్ష యాత్ర "గగన్ యాన్"లో పాలుపంచుకుంటున్న వ్యోమగాములను ప్రధాని నరేంద్రమోడీ పరిచయం చేసుకుని ప్రకటించిన అనంతరం... లీనా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇందులో భాగంగా.. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ను తాను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.

"గగన్ యాన్" లో ప్రశాంత్ బాలకృష్ణన్ గ్రూప్ కెప్టెన్ గా ఉన్నారు! ఇక ఈ జంట ఈ జనవరి 17న వివాహం చేసుకోగా... ఫిబ్రవరి 27న లీనా ఈ విషయాన్ని ప్రకటించడం గమనార్హం. ఇందులో భాగంగా... ఫిబ్రవరి 27 - 2024ల ప్రధాని మోడీ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కు మొదటి భారతీయ వ్యోమగామిగా ఆస్ట్రోనాట్ వింగ్ ని ప్రధానం చేయడం.. దేశానికి, కేరళకు, ముఖ్యంగా తనకు గర్వకారణం అంటూ లీనా ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

ఇదే క్రమంలో... జనవరిలోనే తమ వివాహం జరిగినప్పటికీ... గోప్యత కోసం ఈ విషయాన్ని వెల్లడించలేదని లీనా పేర్కొన్నారు. కాగా... లీనా ప్రముఖంగా మలయాళ సినీ ఇండస్ట్రీలోనే పనిచేశారు. ఇదే క్రమంలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాల్లోనూ నటించారు. ఈ క్రమంలో మలయాళంలో సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆమె పనిచేశారు.

కాగా... గగన్ యాన్ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి వెళ్లబోతున్న నలుగురు వ్యోమగాములను ప్రధాని మోడీ పరిచయం చేసుకుంటూ, జాతికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా ఆ నలుగురూ... గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణ, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా లను మోడీ స్వయంగా అభినందించారు.