Begin typing your search above and press return to search.

అదానీ కాంట్రాక్ట్స్ ని చంద్రబాబు రద్దు చేస్తారా ?

అదాని విషయం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం అదాని నుంచి లంచాలను తీసుకుందని ఆరోపణలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Nov 2024 7:40 AM GMT
అదానీ కాంట్రాక్ట్స్ ని చంద్రబాబు రద్దు చేస్తారా ?
X

అదాని విషయం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం అదాని నుంచి లంచాలను తీసుకుందని ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద వైసీపీ ఖండిస్తోంది. మంత్రి పేర్ని నాని అయితే తమ ప్రభుత్వం ఆనాడు కుదుర్చుకున్న కాంట్రాక్టులు కేంద్ర ప్రభుత్వ సంస్థతోనే అని చెబుతున్నారు. అయితే అదానీ నుంచి ముడుపులు వెళ్లాయని టీడీపీ అనుకూల మీడియా రాస్తోంది. ఈ మొత్తం రాజకీయ రచ్చలో అసలు చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేస్తుంది ఏమి చేయాలి అన్న దాని మీద కూడా భారీ ఎత్తున చర్చ సాగుతోంది.

జగన్ ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తుందా అన్నదే ఇపుడు అంతా ఆసక్తిగా చర్చిస్తున్న విషయం. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు పయ్యావుల కేశవ్ పీఏసీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన అపుడు ఈ ఒప్పందాల మీద అభ్యంతరాలు చెప్పారని అంటున్నారు. మరో వైపు చూస్తే సీపీఐ నేత కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు కూడా వేశారని అంటున్నారు. అదానీతో పవర్ కాంట్రాక్టుల మీద సీపీఐ ఈ విధంగా న్యాయ పోరాటానికి కూడా దిగింది అని అంటున్నారు.

సరే గతంలో జగన్ సర్కార్ అదానీ తో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలు తప్పు అయితే వాటిని ప్రస్తుతం ఆర్ధిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ రద్దు చేయవచ్చు కదా అని అంటున్నారు. అదే విధంగా చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్ అవినీతి అని మాత్రం చెబుతున్నారు. ఆయన వల్ల అంతర్జాతీయంగా ఏపీ పరువు పోయింది అని అంటున్నారు. కానీ అదే సమయంలో అదానీతో జగన్ సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేస్తామని ప్రకటించవచ్చు కదా అని అంటున్నారు. మరి ఎందుకు అలా చేయలేదు అని అంతా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది.

అయితే కమలనాధులతో అదానీకి మంచి రిలేషన్స్ జాతీయ స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. దాంతో అదానీ విషయంలో ఏమి తీసుకున్నా బీజేపీ నుంచి ఒత్తిళ్ళు వస్తాయని ఆలోచిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ విషయంలో బీజేపీ నుంచి ప్రషర్స్ వస్తాయని భయమా అని మేధావులు అంటున్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని చంద్రబాబు గెలవగానే రద్దు చేశారు. ఇది అందరికీ గుర్తు ఉంది. మరి అలాంటి సంచలన నిర్ణయమే ఈ విషయంలో కూడా తీసుకోవచ్చు కదా అని అంటున్నారు. అదానితో ఒప్పందాలు అవినీతిమయం అని ఆరోపిస్తున్నపుడు టీడీపీ అనుకూల మీడియా దీని మీద పెద్ద స్థాయిలో విమర్శలు చేస్తూ వార్తలు రాస్తున్నపుడు ప్రజలకు ఈ విషయంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు అర్జంటుగా ఈ ఒప్పందాలను తాము రద్దు చేసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పవచ్చు కదా అని అంటున్నారు.

ఈ విధంగా ప్రజల సొమ్ము తింటున్న అదానిని ఏపీ నుంచి పక్కకు పెట్టవచ్చు కదా అని అంటున్నారు. మరి చంద్రబాబు అదానీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తే కనుక కూటమి ప్రజల దృష్టిలో గ్రేట్ అవుతుంది అని అంటున్నారు.

బాబు ప్రభుత్వం అయినా జగన్ ప్రభుత్వం అయినా అదానీ ఏపీకి వచ్చి ఒప్పందాలను చేసుకుంటోంది. ఒక విధంగా ఏపీలో అదానీ హవా సాగుతోంది. పార్టీలు మారుతున్నాయి కానీ అదానీ పలుకుబడి మాత్రం ఏపీలో తగ్గడం లేదు అని అంటున్నారు. ఎంతసేపూ టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా విమర్శలు చేసుకోవడం తప్పించి అదానీ గ్రూప్ ని దూరం పెట్టడంలో ఎవరూ ఏమీ చేయడం లేదని మేధావులు అంటున్నారు

ఏపీలో పోర్టులు ఇతర మౌలిక సదుపాయాలు వనరులు అన్నీ కూడా అదానీకి ఇచ్చేస్తూ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. అదానీ పెట్టుబడులు పెడుతున్నారు అని గొప్పగా ప్రకటించుకుంటున్నారు. ఎంతసేపూ రాజకీయంగా ప్రత్యర్ధులను విమర్శించడమే తప్ప అదానీ జోలికి ఎందుకు పోవడం లేదన్న సందేహాలు అయితే అందరిలోనూ కలుగుతున్నాయి. మరి చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో ఏమైనా సంచలన నిర్ణయం తీసుకుంటుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.