Begin typing your search above and press return to search.

ఆ 4 వేల కోట్లు కట్టకుంటే బంగ్లాకు చీకట్లే.. అదీ అదానీ ‘ఎనర్జీ’

బంగ్లాదేశ్ లో గత నెల 5న ప్రధానిగా ఉన్న షేక్ హసీనాపై తిరుగుబాటు జరిగిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Sep 2024 3:30 PM GMT
ఆ 4 వేల కోట్లు కట్టకుంటే బంగ్లాకు చీకట్లే.. అదీ అదానీ ‘ఎనర్జీ’
X

కొన్నిసార్లు మనకు నచ్చకున్నప్పటికీ.. కొన్ని అంశాలను, కొందరు వ్యక్తులను మెచ్చుకోవాలి... దాదాపు ఏడాదిన్నర కిందట దేశంలో అదానీ గ్రూప్ గురించి వచ్చిన కథనాలు పెద్ద సంచలనం. పారిశ్రామికవేత్త అదానీ.. ప్రధాని మోదీకి సన్నిహితులని.. అందుకే ఆయన సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగిందనే ఆరోపణలు వచ్చాయి. అదానీ అంతా అక్రమ ఆమ్ దానీ (ఆదాయం) అనే వరకు వెళ్లారు. కానీ, ఇప్పుడదే అదానీ యావత్ భారత్ దేశానికి పరోక్షంగా మేలు చేస్తున్నారు. ఆ విషయం గురించి తెలుసుకుంటే అదీ అదానీ ‘ఎనర్జీ’ అని ఒప్పుకోక మానరు.

సమీక్షిస్తాం అంటారు కానీ..

బంగ్లాదేశ్ లో గత నెల 5న ప్రధానిగా ఉన్న షేక్ హసీనాపై తిరుగుబాటు జరిగిన సంగతి తెలిసిందే. ఆమె.. స్వదేశం వీడి భారత్ కు రావడం అప్పటినుంచి మన దేశంలోనే ఉండడం చూస్తున్నాం. ఈలోగా బంగ్లాలో నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, 81 ఏళ్ల యూనస్ ప్రభుత్వం ఎన్నికలు జరిగే వరకే. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్ లో హసీనా ప్రభుత్వం ఉండగా.. అదానీ సంస్థతో కుదుర్చుకున్న విద్యుత్తు ఒప్పందాన్ని అవసరమైతే సమీక్షిస్తాం. ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తో చర్చిస్తాం’ అని చెప్పారు. కానీ, అదేమంత సులభం కాదు.

చీకట్లో అప్పుల కుప్ప..

ఇప్పటికే బంగ్లా లో విద్యుత్తు సంక్షోభం తీవ్రమవుతోంది. కరెంటు కొరతను తీర్చుకోకుంటే మున్ముందు అది చీకట్లకు దారితీయడం ఖాయం. కానీ, మరోవైపు అప్పుల భారం. మన దేశానికి చెందిన అదానీ గ్రూప్ నకే 500 మిలియన్‌ డాలర్లు (రూ.4వేల కోట్లు) బాకీ పడింది బంగ్లా ప్రభుత్వం. ఈ ఒప్పందాన్ని హసీనా ప్రభుత్వం చేసుకుందని.. అది తమ ప్రజల పాలిట తీవ్ర భారంగా మారిందని ఆరోపిస్తోంది తాత్కాలిక ప్రభుత్వం. అందుకే అవసరాన్ని బట్టి సమీక్షిస్తాం అని చెబుతోంది.

జార్ఖండ్ నుంచి బంగ్లాకు..

తమకు రావాల్సిన బకాయిలపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని అదానీ గ్రూప్ హెచ్చరించింది. జార్ఖండ్ లోని అదానీ పవర్ కు చెందిన గొడ్డా ప్లాంట్‌ నుంచి బంగ్లాదేశ్ కు విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. 2017లో హసీనా ప్రధానిగా ఉండగా దీనిని కుదుర్చుకున్నారు. అదానీ పవర్-

బంగ్లాదేశ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు మధ్య 25ఏళ్ల అగ్రిమెంట్ చేసుకున్నారు. గొడ్డా ప్లాంట్‌లో ఉత్పతయ్యే మొత్తం 1,496 మెగావాట్ల విద్యుత్‌ ను బంగ్లాదేశ్‌ కు సరఫరా చేస్తున్నారు. ఆ దేశ విద్యుత్‌ డిమాండ్‌లో ఇది 10 శాతం కావడం గమనార్హం. గత ఏడాది జూన్ నుంచి ఈ సరఫరా మొదలైంది. అయితే, ఖర్చులు, ఇతరత్రా కారణాలతో బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్తిగా చెల్లింపులు చేయలేకపోయింది.

కట్టకుంటే కట్ కటానే..

రూ.4 వేల కోట్ల బకాయిలు కట్టకుంటే.. కరెంటు ఇవ్వలేమని అదానీ సంస్థ.. మొహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇప్పటికైతే విద్యుత్తు సరఫరాను నిలిపివేయం కానీ.. మున్ముందు ఇలా బకాయిలు చెల్లించకుంటే కష్టమని తేల్చిచెప్పింది. కానీ, తాజా పరిస్థితులను బట్టి చూస్తే బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రపంచ బ్యాంక్‌ వంటి ఆర్థిక సంస్థల నుంచి సాయం కోరుతోంది.

మనకేంటి లాభం..?

బంగ్లా ప్రభుత్వ సారథి యూనస్ భారత్ కు పచ్చి వ్యతిరేకి. ఈ విషయాన్ని ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. ఇప్పుడు భారత్ కు వ్యతిరేకంగా ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా.. అదానీ పవర్ కట్ అవుతుంది. లేదా.. డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఏది జరిగినా బంగ్లాకు ఇది సంకటమే.