ఇదంతా అందుకే... హిండెన్ బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ కీలక వ్యాఖ్యలు!
ఈ ఆరోపణలపై ఇప్పటికే మాధబి పురి, ఆమె భర్త సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. హిండెన్ బర్గ్ తమపై వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
By: Tupaki Desk | 11 Aug 2024 8:54 AM GMTఅమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్.. అదానీ గ్రూప్ పై చేస్తోన్న ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మరిషస్ ఫండ్స్ లో సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురి, ఆమె భార్తకు వాటాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇవి వైరల్ గా మారాయి.
ఈ ఆరోపణలపై ఇప్పటికే మాధబి పురి, ఆమె భర్త సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. హిండెన్ బర్గ్ తమపై వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ జీవితం తెరిచిన పుస్తకం అని, ఏ శాఖ అధికారులు కోరినా ఏ ఆర్థిక కార్యకలాపాల వివరాలు అయిన వెల్లడించేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఈ సమయంలో అదానీ గ్రూప్ స్పందించింది.
ఇదంతా అందుకే... హిండెన్ బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ కీలక వ్యాఖ్యలు!ఇందులో భాగంగా... హిండెన్ బర్గ్ ఆరోపణలపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు జరిగిందని.. అవన్నీ నిరాధారమైనవని తేలిందని అదానీ గ్రూప్ పేర్కొంది. ఈ ఆరోపణలపై గతంలోనే సెబీ, సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చినట్లు తెలిపింది. అయినా కూడా హిండెన్ బర్గ్ పాత ఆరోపణలను పదే పదే చేస్తోందన్ని అదానీ గ్రూప్ ప్రతినిధి ఒకరు స్టాక్ ఎక్సేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపారు.
ఇదే సమయంలో... తమ వ్యాపారాలన్నీ చట్టాలకు లోబడే జరుగుతున్నాయని, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూనే ఉన్నామని, పారదర్శకంగానే ముందుకు వెళ్తున్నామని, తమ కంపెనీలకు ఏ వ్యక్తితోనూ వాణిజ్య పరమైన సంబంధాలు లేవని అదానీ గ్రూప్ తెలిపింది. దీంతో... పరోక్షంగా మాధబి పురి ని ఉద్దేశించి అదానీ గ్రూప్ ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు.