Begin typing your search above and press return to search.

వాటి కోసం మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే

అంతకంతకూ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్ లను సమకూర్చుకోవటానికి మరింత కాలం పట్టనుంది. దీనికి సంబంధించిన ఆసక్తికర అంశాలు తాజాగా వెలుగు చూశాయి.

By:  Tupaki Desk   |   9 Jan 2025 10:30 AM GMT
వాటి కోసం  మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే
X

అంతకంతకూ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్ లను సమకూర్చుకోవటానికి మరింత కాలం పట్టనుంది. దీనికి సంబంధించిన ఆసక్తికర అంశాలు తాజాగా వెలుగు చూశాయి. హైదరాబాద్ మెట్రోలో ఇప్పటివరకు నడుస్తున్న రూట్లలో అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తున్న మార్గం అమీర్ పేట - రాయదుర్గం మెట్రో స్టేషన్. ఈ రెండు స్టేషన్ల మధ్య రోజుకు సగటున 5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మరి.. ముఖ్యంగా ఉదయం..సాయంత్రం వేళలో ఈ రద్దీ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

ట్రైన్ లోపల కాలుపెట్టలేనంతగా రద్దీ ఉంటోంది. దీంతో.. ఈ మార్గంలో రద్దీ వేళలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వస్తోంది. దీనిపై మెట్రో అధికారులుఇప్పటివరకు అధికారికంగా మాట్లాడింది లేదు. తాజాగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో అదనపు బోగీల గురించి ఎల్ అండ్ టీ అధికారులతో పాటు మెట్రో అధికారులను ప్రశ్నించగా.. అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నడుపుతున్న కోచ్ లను అప్పట్లో దక్షిణ కొరియా నుంచి హ్యుందాయ్ రోటెమ్ సంస్థ సరఫరా చేసింది. ఆ కోచ్ లనే నడుపుతున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ భారత్ కు కోచ్ లను తయారు చేయటం లేదు. మరోవైపు.. దేశీయంగా డెవలప్ చేసిన కోచ్ లను తీసుకురావటానికి కనీసం పద్దెనిమిది నెలల సమయం పడుతుంది. నాగపూర్.. పుణె నుంచి లీజు పద్దతిలో కోచ్ లను తీసుకురావాలని భావించినా.. అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు.

దీంతో.. దేశీయంగా తయారుచేసే కోచ్ లను తీసుకురావాలన్నా.. వాటికి ఆర్డర్ ఇచ్చి.. అవి తయారై.. పట్టాల మీదకు ఎక్కే సరికి 18 నెలల పడుతుందని చెబుతున్నారు. దీంతో.. ఇప్పటికిప్పుడు కోచ్ లకు ఆర్డర్ ఇచ్చినా.. అవి అందుబాటులోకి వచ్చేసరికి రెండేళ్లు పడుతుందని అంటున్నారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందుల్లో కిందా మీదా పడుతున్న ఎల్ అండ్ టీని ప్రభుత్వం ఆదుకుంటే తమ సమస్యల నుంచి గట్టెక్కేందుకు వీలవుతుందని చెబుతున్నారు. మొత్తంగా ప్రయాణికుల ఇబ్బందుల్ని గుర్తించి ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్పించి..మెట్రో అదనపు కోచ్ ల ఇష్యూ ఒక కొలిక్కి రాదని చెప్పక తప్పదు.