Begin typing your search above and press return to search.

గ్యాస్ట్రిక్ సమస్య - నిద్రమాత్రలు... మధ్యలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే!

అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Jun 2024 3:05 PM GMT
గ్యాస్ట్రిక్ సమస్య - నిద్రమాత్రలు... మధ్యలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే!
X

నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వచ్చేస్తుందని అంటుంటారు! ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతోపాటు... కొన్ని మీడియా సంస్థలు సైతం అంతకంటే దారుణంగా గాసిప్స్ ని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో... ఊహాగాణాలు, ప్రచారాలు హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే విషయంలో అదే జరిగిందని అంటున్నారు!

అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన ఆ పార్టీ ఈసరి కేవలం 11 సీట్లకే పరిమితమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో... పలువురు వైసీపీ నేతలకు సంబంధించిన పలు ప్రచారాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

ఇందులో భాగంగా... మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆయన సొంత నియోజకవర్గాన్ని వదిలి వెళ్లారనే గాసిప్స్ హల్ చల్ చేశాయి. అయితే... మీడియా ముందుకు వచ్చి అనిల్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఫలితాలు వచ్చి 10 రోజులు కూడా కాకుండా ప్రభుత్వంపై ఏమని స్పందిస్తామని అన్నారు.

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత అదీప్ రాజు ఆత్మహత్యాయత్నం చేశారని, నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లారని, దీంతో ఆయనను రాత్రికి రాత్రి ఆస్పత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారని ప్రచారం జరిగింది. దీంతో... ఆ ప్రచారంపై ఆయనే స్వయంగా స్పందించారు. ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు.

ఇందులో భాగంగా... తాను ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని.. తనకు ఆ అవసరం లేదని అదీప్ రాజు స్పష్టం చేశారు. గ్రాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్ అయ్యినట్లు అదీప్ రాజు తెలిపారు. ఫుడ్ పాయిజన్ అయ్యిందనుకొని ఆస్పత్రికి వెళ్తే... అది గ్రాస్ట్రిక్ సమస్య కావడంతో చికిత్స అందించిన అనంతరం వైద్యులు డిశ్చార్జ్ చేశారని తెలిపారు.

విషయం తెలియకుండా కొంతమంది.. తెలిసి కూడా కావాలని కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. తనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతూ.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో... ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చినట్లయ్యిందని అంటున్నారు.