Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వద్దు... ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలకు కూడా కాకముందే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకీ వేడెక్కుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 July 2024 7:28 AM GMT
వైసీపీ ఎమ్మెల్యేలు  బీజేపీలోకి వద్దు... ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు!
X

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలకు కూడా కాకముందే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకీ వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన 10 రోజుల నుంచే ఈ తరహా సందడి నెలకొంది. ఈ క్రమంలో... వైసీపీలో జగన్ కాకుండా ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు, 4 గురు లోక్ సభ ఎంపీలు గోడ దూకుతున్నారంటూ వచ్చిన ప్రచారం వైరల్ గా మారింది.

ప్రధానంగా... వైసీపీ కీలక నేత, ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం ఈ మేరకు ఒత్తిడి తెస్తున్నారని ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే... బీజేపీ నేతలే ఈ తరహా ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని అంటారు. ఈ నేపథ్యంలో... ఘాటుగా రియాక్ట్ అయిన మిథున్ రెడ్డి.. తనకు అంత ఖర్మ పట్టలేదన్నట్లుగా కామెంట్ చేశారు.

దీంతో... ఆ ప్రచారం అక్కడితో ఆగింది! అనంతరం.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలోనూ ఇదే తరహా ప్రచారం తెరపైకి వచ్చింది! దీంతో... అవినాష్ కూడా వివరణ ఇచ్చుకున్నారు.. ఆ ప్రచారానికి మించిన పెద్ద జోక్ లేదన్నట్లుగా స్పందించారు! ఈ నేపథ్యంలో... జగన్ కాకుండా మిగిలిన 10మంది వైసీపీ ఎంపీలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ వైసీపీ నేతలు బీజేపీలో చేరిపోతున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్న వేళ.. ఆదినారాయాణ రెడ్డి మరోమారు స్పందించారు! ఇందులో భాగంగా... జగన్ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని తీసుకొస్తాను.. బీజేపీలో చేర్చుకోవాలని రాయలసీమకు చెందిన ఓ పెద్ద మనిషి తనతో అన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు! అయితే... అందుకు తాను ఒప్పుకోలేదని ఆదినారాయణ రెడ్డి చెప్పడం గమనార్హం!

అయితే... ఏ హోదాలో ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరతామని వస్తోన్న వైసీపీ ఎమ్మెల్యేలను వద్దాన్నారనే సంగతి కాసేపు పక్కనపెడితే... వాళ్లందరినీ చేర్చుకుంటే వాళ్లు చేసిన తప్పులకు తాము బాధ్యులం అవుతామని అన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నిజంగానే వైసీపీ ఎమ్మెల్యేలు 10మందీ బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా.. లేక, ఆదినారాయణ రెడ్డి కావాలనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది!