13 ఏళ్లకే కంపెనీ ప్రారంభించిన ఇండియన్ గురించి తెలుసా?
9 ఏళ్ల వయసులోనే మొట్టమొదటిసారిగా మొబైల్ యాప్ ను సృష్టించాడు... 13 ఏళ్లకే సొంత కంపెనీని కలిగి ఉన్నాడు.
By: Tupaki Desk | 19 Sep 2024 4:30 PM GMTసక్సెస్ కి షార్ట్ కట్స్ ఉండవు.. ఆలోచించడం, ఆలోచించిన దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రమే మార్గం అని చెబుతుంటారు! అయితే... ఆ ఆలోచనకు, దాని ఆచరణకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడు కేరళకు చెందిన ఆదిత్యన్ రాజేష్. 9 ఏళ్ల వయసులోనే మొట్టమొదటిసారిగా మొబైల్ యాప్ ను సృష్టించాడు... 13 ఏళ్లకే సొంత కంపెనీని కలిగి ఉన్నాడు.
అవును... కేరళకు చెందిన ఆదిత్యన్ రాజేష్ అతిపిన్న వయసులోనే కంపెనీ స్థాపించాడు! ఇప్పుడు దుబాయ్ లో ఉన్న ఆధిత్యన్.. వెబ్ డిజైన్, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లో ప్రత్యేకత కలిగిన ట్రినెట్ సొల్యూషన్స్ కంపెనీ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు! అతి చిన్న వయసులోనే ప్రారంభమైన అతడి ప్రయాణం.. ఎంతో మంది యువతకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేరణ!
చిన్ననాటి నుంచీ టెక్నాలజీపై మక్కువ ఎక్కువగా ఉన్న ఆదిత్యన్... అతని 5వ ఏటనే కంప్యూటర్లపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఈ సమయంలో అతని తండ్రి బీబీసీ టైపింగ్ వెబ్ సైట్ పరిచయడం చేయడంతో మరింత ఉత్సాహం వచ్చింది. ఈ క్రమంలోనే 9ఏళ్ల వయసులో ఆదిత్యన్ తన మొట్టమొదటి మొబైల్ అప్లికేషన్ ను రూపొందించాడు.
ఓ పక్క స్కూల్ హోంవర్క్స్ ఉన్నప్పటికీ.. అతడి వ్యక్తిగత ఆసక్తికి అవి ఆటంకం కాలేదు. ఈ క్రమంలో కేవలం 13 సంవత్సరాలకే అతను ట్రినేట్ సొల్యూషన్ ని స్థాపించాడు. దుబాయ్ లో అతడి కంపెనీ వెబ్ సైట్లు, అప్లికేషన్ లను రూపొందించడమే కాకుండా.. వినియోగదారులకు విభిన్న ఐటీ పరిష్కారాలను కూడా అందిస్తుంది.
ఇలా ఆదిత్యన్ ట్రైనెట్ సొల్యూషన్స్ ను నడపడంతో పాటు "ఎ క్రేజ్"తో యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్నాడు. ఈ ఫ్లాట్ ఫాం లో అతను.. టెక్నాలజీ, కోడింగ్, గేమింగ్, వెబ్ డిజైన్ గురించి తనకున్న పరిజ్ఞానాన్ని పంచుకుంటున్నాడు. సమీప భవిష్యత్తులో ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ పై కోర్సులను తన ఛానల్ లో అందించాలని అనుకుంటున్నాడు.
ఈ ఆదిత్యన్ వయసు రీత్యా పూర్తిగా అతని పేరుపై కంపెనీ ఇంకా అధికారికంగా నమోదు కానప్పటికీ.. అతని స్నేహితుల సహాయంతో పనిచేస్తుంది. వారు 12 మంది క్లయింట్ ల కొసం ప్రాజెక్టులను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. భవిష్యత్తులో ఆదిత్యన్ ప్రపంచ వ్యాప్తంగా ట్రినెట్ సొల్యూషన్స్ ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నారు.