విమానంలో మహిళలు, చిన్నారులు... స్క్రీన్స్ పై అడల్ట్ మూవీ!!
అవును... విమానంలో ప్రయాణిస్తున్న ప్రతీ ప్రయాణికుడికి ప్రత్యేకంగా ఉన్న ఎల్.ఈ.డీ. స్క్రీన్ లలో ఓ సినిమా ప్రసారం మొదలైంది.
By: Tupaki Desk | 7 Oct 2024 5:30 PM GMTఇటీవల కాలంలో ప్రయాణికులకు విమానాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావనే సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదీకగా ప్రపంచానికి ఇట్టే తెలుస్తున్నాయి. ఇందులో కొన్ని సదరాగా ఉంటే, మరికొన్ని అసహ్యంగా ఉంటాయి, ఇంకొన్ని జుగుప్సాకరంగాను ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మరో అసభ్యకరమైన వ్యవహారం జరిగింది.
అవును... విమానంలో ప్రయాణిస్తున్న ప్రతీ ప్రయాణికుడికి ప్రత్యేకంగా ఉన్న ఎల్.ఈ.డీ. స్క్రీన్ లలో ఓ సినిమా ప్రసారం మొదలైంది. అయితే అది "అడల్ట్ కంటెంట్" ఉన్న మూవీ. దీంతో... ఆ విమానంలో చిన్నారులతో ప్రయాణిస్తున్న మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కారణం.. అది అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీ కాగా.. ఆ స్క్రీన్స్ ని ఆఫ్ చేసే అవకాశం లేని టెక్నికల్ సమస్య తెరపైకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్ లోని హనెడాకు క్వాంటాస్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ బయలుదేరింది. ఈ సమయంలో ఆ విమానంలోని ప్రయాణికుల్లో చిన్నారులు, మహిళలు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో... వారందరి కోసం సిబ్బంది ఓ చిత్రాన్ని ప్రదర్శించడం ప్రారంభించింది. అయితే... అది అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రం!
దీంతో... ఆ సమయంలో చిన్నారులు, మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు! తమకు ఆ ప్రసారం అవసరం లేదని భావించి.. ఆపేద్ద్దామని ప్రయత్నించినా కుదరలేదు. దీనికి టెక్నికల్ సమస్యే కారణం అని ఎయిర్ లైన్స్ సిబ్బంది భావించారు. దీంతో... కాసేపటి తర్వాత ఎలాగోలా ప్రయత్నించి దాన్ని నిలిపేశారు.
ఆ తర్వాత కాసేపటికి చిన్నపిల్లలకు నచ్చె సినిమాను ప్రదర్శించారు! అయితే... అంతకముందు ఎదురైన అనుభవంతో ఇబ్బంది పడిన పలువురు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరి స్కీన్ వారు ఆపుకునే అవకాశం లేకపోవడంపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో క్వాంటాస్ విమానయాన సంస్థ స్పందించింది. ఈ అసౌకర్యానికి క్షమించాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ చేదు అనుభవం ఎదుర్కొన్న ప్రతీ ప్రయాణికుడికి తాము క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది క్వాంటాస్ విమానయాన సంస్థ. వెంటనే సినిమాను మార్చేసి, మరో సినిమాను ప్రదర్శించినట్లు చెప్పుకుంది! ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని.. ఇదంతా టెక్నికల్ ప్రోబ్లం వల్లే ఎదురైందని ఈ విమానయాన సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.