ఆమె.. ఆయన.. మధ్యలో పో**ర్న్.. సంసారంలో నిప్పులు
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రస్తుత కాలంలో అత్యంత సమస్యాత్మకంగా మారిన పో**ర్న్.. సంసారంలో నిప్పులు పోస్తున్నదని స్పష్టమైంది.
By: Tupaki Desk | 10 Nov 2024 5:30 PM GMTఇప్పుడంతా హైటెక్ యుగం.. చేతిలో సెల్ ఫోన్ ఉంటే మొత్తం పనులు చక్కబెట్టే కాలం.. అయితే, దీంట్లో మంచి ఎంత ఉందో.. చెడు కూడా అంతే ఉంది.. వ్యక్తిగత వివరాలు సహా అన్నీ మొబైల్ లో నిక్షిప్తం అయిన నేపథ్యంలో ముప్పు మూడింతలు పొంచి ఉంది. ఇక విచక్షణ లేని వ్యక్తులు మొబైల్ లో అశ్లీలం (పో*ర్న్) వీక్షణకు అలవాటు పడి దారి తప్పుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రస్తుత కాలంలో అత్యంత సమస్యాత్మకంగా మారిన పో#ర్న్.. సంసారంలో నిప్పులు పోస్తున్నదని స్పష్టమైంది.
నిందించలేని మూడో మనిషి
దంపతుల మధ్య మూడో మనిషి చేరితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కొన్నాళ్లుగా వార్తలుగా చూస్తున్నాం. సంసారాలను కుప్పుకూలుస్తున్న ఆ మూడో వ్యక్తికి మరో రూపమే సెల్ ఫోన్ గా మారింది. అయితే, అది నేరుగా కాదు.. ‘అశ్లీలం’ ద్వారా. ఈ తరహా వీడియోలు చూడడానికి అలవాటు పడినవారు తమ భాగస్వాములను వేధిస్తున్నట్లుగా ఇటీవల వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా పురుషులు (భర్తలు) పాల్పడుతున్న ఈ తరహా చర్యలు గృహిణులను శారీరకంగా, మానసికంగా చిత్రహింసల పాల్జేస్తోంది. వారి చర్యలను భరిస్తున్నవారు అనారోగ్యం బారినపడుతుంటే మరికొందరు ఇలాంటిది తమవల్ల కాదంటూ బోరుమంటున్నారు.
సమాజానికి పెనుముప్పు..
సమాజంలో అభంశుభం తెలియని పసివారిపై అత్యాచార ఘటనలు పెరిగేందుకు పోర్న్ వెబ్ సైట్లే కారణమనడంలో సందేహం లేదు. ఇలాంటివాటికి వయసు తేడా లేకుండా అలవాటు పడుతున్నారు. అదే పో*ర్న్.. కాపురాల్లోకీ చొరబడుతోంది. వీడియోల్లో తాము ఏదైతే చూశామో అలానే చేయాలంటూనో.. ఆ వీడియోలను భార్యలకు చూపుతూనో.. విచక్షణ కోల్పోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో నెలకు 400 పైగా గృహహింస కేసులు నమోదువుతుండగా.. అశ్లీల వీడియోలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయట.
మహిళలకు మనో వేదన
భర్తలు పెడుతున్న హింసను తట్టుకోలేక మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారట. దీనిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నారట. కుటుంబ సభ్యులకూ చెప్పలేక మౌనంగా భరిస్తున్నారట. ఇది మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. కౌన్సెలింగ్ సందర్భంగానూ తొలుత తాము ఎదుర్కొంటున్న ఇబ్బందిపై నోరు మెదపడం లేదని.. చివరకు దాని ద్వారా కలిగే విపరిణామాలను వివరించాకే గోడు చెప్పుకొంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.