Begin typing your search above and press return to search.

బెంగళూరు ఎయిర్ షో కు నాన్ వెజ్ షాపులకు సంబంధం ఏమిటి?

ఇందులో భాగంగా... ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చుట్టూ మాంసం విక్రయాలు ఆపేయాలని ఆదేశించింది.

By:  Tupaki Desk   |   19 Jan 2025 4:46 AM GMT
బెంగళూరు ఎయిర్  షో కు నాన్  వెజ్  షాపులకు సంబంధం ఏమిటి?
X

ఫిబ్రవరి 10 నుంచి 14 వరకూ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏరో ఇండియా షో జరగనుంది. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో బృహత్ బెంగళూరు మహానగరపాలక సంస్థ (బీబీఎంపీ) ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చుట్టూ మాంసం విక్రయాలు ఆపేయాలని ఆదేశించింది.

బెంగళూరులో వచ్చే నెల 10నుంచి ఏరో ఇండియా షో జరగనుండగా.. ఈ నెల నుంచే యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చుట్టూ మాంసం విక్రయాలు ఆపేయాలని బీబీఎంపీ ఆదేశించింది. ఇందులో భాగంగా.. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చుట్టూపక్కల సుమారు 13 కిమీ పరిధిలోని ఏ మటన్, చికెన్ షాపులోనూ మాంసం విక్రయాలు జరగకూడదని తెలిపింది.

షాపులే కాదు.. నాన్ వెజ్ వంటకాలు అందించే రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఈ బీబీఎంపీ ఆదేశాలను అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 17 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని తెలిపింది. దీంతో... ఎయిర్ షో కు నాన్ వెజ్ కు ఏమిటి సంబంధం అనే చర్చ తెరపైకి వచ్చింది. దానికీ క్లారిటీ ఇచ్చింది బీబీఎంపీ!

అవును... ఎయిర్ షో కు నాన్ వెజ్ కు ఏమిటి కనెక్షన్ అనే అనుమానాలు ఈ సందర్భంగా చాలా మంది వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఎయిర్స్ ఫోర్స్ స్టేషన్ లో ఎయిర్ షో జరగడానికి.. నాన్ వెజ్ దుకాణాలకు, హోటళ్లకు ఏమిటీ కనెక్షన్ అనే సందేహాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సందేహాలకు బీబీఎంపీ అధికారులు క్లారిటీ ఇస్తున్నారు.

ఇందులో భాగంగా... మటన్, చికెన్ విక్రయించే దుకాణాల వద్ద ఎక్కువగా గద్దలు, డేగలు వంటివి తిరుగుతుంటాయని.. ఇవి ఎయిర్ షో జరిగే సమయంలో ఆ ప్రాంతంలోకి వస్తే ప్రమాదాలు జరుగుతాయని.. ఆ ఉద్దేశ్యంతోనే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా... ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారని అంటున్నారు.

కాగా... ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఏరో ఇండియా - 2025 ప్రదర్శన జరగనుంది. ఈ సమయంలో ఈ షో దేశంలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శనగా చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 53 విమానాలు పాల్గొంటాయని చెబుతూ.. సుమారు 7 లక్షల మంది సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.