పెళ్లైన వ్యక్తితో “వ్యవహారం”... చేజారిన అందాల కిరీటం!
వివరాళ్లోకి వెళ్తే... ఉక్రెయిన్ లో జన్మించిన కరోలినా షినో అయిదేళ్ల వయసులో తల్లితోసహా వచ్చేసి జపాన్ లో పెరిగింది.
By: Tupaki Desk | 7 Feb 2024 6:06 AM GMTఅదృష్టం డోర్ కొట్టేలోపు దురదృష్టం బెడ్ రూంలోకి వచ్చేసిందను కోవాలో ఏమో కానీ... అద్భుతంగా దక్కిన అరుదైన గౌరవం అంతలోనే చేజారిపోయింది! అందుకు కారణమైంది... వివాహితుడితో సాగించిన ఎఫైర్ అని అంటున్నారు. పెళ్లైన వ్యక్తితో వ్యవహారం నడపడంతో "మిస్ జపాన్” కిరీటం మిస్సయ్యింది. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఆ "వ్యవహారం" ఎంత పని చేసింది అంటూ ఫీల్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్!!
అవును... తన ప్రతిభతో అందాల కిరీటాన్ని దక్కించుకున్న ఓ ముద్దుగుమ్మ... వివాహితుడైన వ్యక్తితో వ్యవహారం నడిపిందనే కారణంతో ఆమె ఆ గౌరవాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఆమెకు పోటీ నిర్వాహకులు మొదట్లో మద్దతుగా నిలిచినా... ఆ వ్యక్తి వివాహితుడని ఆమెకు తెలియదని సమర్ధించినా ఫలితం లేకపోయింది. అన్నీ తెలిసే ఆమె అతడితో రిలేషన్ లో ఉందని వెల్లడైందని తెలుస్తుంది.
వివరాళ్లోకి వెళ్తే... ఉక్రెయిన్ లో జన్మించిన కరోలినా షినో అయిదేళ్ల వయసులో తల్లితోసహా వచ్చేసి జపాన్ లో పెరిగింది. ఈ సమయంలో 26 ఏళ్ల వయసులో దేశం కాని దేశంలో మోడల్ గా సత్తా చాటింది. ఇందులో భాగంగా గత నెల జరిగిన మిస్ జపాన్ పోటీల్లో విజేతగా నిలిచింది. వాస్తవానికి... తమ దేశీయురాలు కాని ఆమె "మిస్ జపాన్" కిరీటం ఎలా కట్టబెడతారంటూ విమర్శలు కూడా వచ్చాయి.
ఆ సంగతి అలా ఉంటే... ఆమెకు ఓ వివాహితుడితో సంబంధం ఉందని స్థానిక పత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే.. ఆమె విదేశీయురాలని, ఆమెకు వివాహితుడితో సంబంధం ఉందని వచ్చిన ఆరోపణలు, కండిషన్స్ పై అందాల పోటీ నిర్వాహకులు మొదట్లో కరోలినాకు మద్దతుగా నిలిచారు. ఆమె సంబంధం కొనసాగిస్తున్న సదరు వ్యక్తి వివాహితుడనే విషయం ఆమెకు తెలియదని సమర్థించారు.
అయితే... ఆమెకు అతడు వివాహితుడనే విషయం తెలిశాక కూడా తన సంబంధాన్ని కొనసాగించిందనే విషయం తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఆమె పనిచేస్తున్న మోడల్ ఏజెన్సీ ఈ విషయాలను వెల్లడించింది. ఇలా ఈ విషయాలన్నీ బయటకు రావడంతో... అందాల పోటీల నిర్వాహకులకు క్షమాపణలు తెలిపిన కరోలినా... తన మిస్ జపాన్ కిరీటాన్ని వదులుకొంటున్నట్లు ప్రకటించింది.