Begin typing your search above and press return to search.

బైడెన్ విధానాలే క‌మ‌ల‌కు ఎస‌రు పెట్టాయా?

270 స్థానాలు ద‌క్కించుకుని స‌గ‌ర్వంగా అమెరికా అధ్య‌క్ష పీఠాన్ని అధిరించాల‌ని భావించిన ఆమె 220 ద‌గ్గ‌రే ఆగిపోయారు.

By:  Tupaki Desk   |   6 Nov 2024 11:30 AM GMT
బైడెన్ విధానాలే క‌మ‌ల‌కు ఎస‌రు పెట్టాయా?
X

అమెరికా అధ్య‌క్ష పీఠాన్ని ద‌క్కించుకునేందుకు.. ఆది నుంచి విజ‌యంపై ఆశ‌లు పెట్టుకున్న ప్ర‌స్తుత ఉపాధ్య‌క్షురాలు, డెమొక్రాటిక్ పార్టీ మ‌హిళా నాయ‌కురాలు క‌మ‌లా హ్యారిస్‌.. ఊహించ‌ని ప‌రాభ‌వాన్ని చ‌వి చూశారు. 270 స్థానాలు ద‌క్కించుకుని స‌గ‌ర్వంగా అమెరికా అధ్య‌క్ష పీఠాన్ని అధిరించాల‌ని భావించిన ఆమె 220 ద‌గ్గ‌రే ఆగిపోయారు. నిజానికి ఇది ఊహించ‌ని ప‌రాభ‌వ‌మే. ఎందుకంటే.. అధ్య‌క్షుడు జో బైడెన్‌.. త‌ర్వాత‌.. అంత రేంజ్‌లో ఆమె దూసుకు పోయారు.

అంతేకాదు.. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ఈ రేంజ్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌కు రావ‌డం కూడా.. క‌మ‌ల హ్యారిస్ కార‌ణ‌మ‌నే చెప్పాలి. అయితే.. ఆమె అనూహ్యంగా వెనుక‌బ‌డి పోయారు. క‌రోలినా.. అరిజోనా వంటి కీల‌క రాష్ట్రాల్లోనూ ఆచితూచి మాత్రమే ఓట‌ర్లు స్పందించారు. ఇక‌, బ‌ల‌మైన స్వింగ్ రాష్ట్రాల్లోనూ డెమొక్రా ట్ల నుంచి మ‌ద్ద‌తు ద‌క్కించుకోవ‌డంలో క‌మ‌ల వెనుక‌బ‌డ్డారు. ఈ ప‌రిణామాల‌తో అస‌లు ఎందుకు ఇలా జ‌రిగింది? ఏయే కార‌ణాల‌తో ఇలా క‌మ‌ల వెనుక‌బ‌డ్డ‌ర‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ప్ర‌ధానంగా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జోబైడెన్ అనుస‌రిస్తున్న విధానాల‌ను.. అమెరిక‌న్లు తీవ్రంగా త‌ప్పుబ‌డు తున్నారు. లోపాయికారీ ఒప్పందాలు.. యుద్ధాల‌ను ప‌రోక్షంగా ప్రోత్స‌హించ‌డం వంటివి అంత‌ర్జాతీయం గా బైడెన్‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. ఇక‌, గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా అమెరికాలో నిరుద్యోగం 30 శాతం నుంచి పైకి ఎగ‌బాకింది. ఆర్థిక విష‌యాల్లోనూ.. బైడెన్ స‌ర్కారు విఫ‌ల‌మైంది. ద్రోవ్యోల్బ‌ణం కార‌ణంగా.. అమెరికాలో అతి పెద్ద సంస్థ‌లు కూడా.. పేక మేడ‌ల్లా కూలుతున్నాయి. దీంతో ఉద్యోగాల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది.

ఇక‌, భార‌త్‌తో సఖ్య‌త కోరుకునే అమెరిక‌న్ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండానే.. అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ త‌న విధానాల‌ను అనుస‌రించారు. భార‌త్‌లో ప్ర‌జాస్వామ్యం లేద‌ని, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేయ‌డం స‌రికాద‌ని.. ఇలా త‌న ఇస్టాను సారం బైడెన్ వ్య‌వ‌హ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే బైడెన్‌కు తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగింది. అయితే.. ఆయ‌న త‌ర్వాత‌.. అధ్య‌క్ష రేసులోకి క‌మ‌ల వచ్చినా.. బైడెన్ పాల‌న‌ను, విధానాల‌ను కొన‌సాగించ‌బోన‌ని చెప్పినా.. ఎవ‌రూ విశ్వ‌సించ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

పైగా బ‌ల‌మైన భార‌త్ వ్యూహం కూడా.. అమెరికాలో బాగానే వ‌ర్క‌వుట్ అయింది. మొత్తంగా చూస్తే.. బైడెన్ విధానాల విష‌యంలో గోడ‌పై పిల్లివాటంలో క‌మ‌లా హ్యారిస్ వ్య‌వ‌హ‌రించినందుకే.. ఆమెకు ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్న‌ది ప‌రిశీల‌కులు వేస్తున్న అంచ‌నా.