ముహూర్తం ఫిక్స్.. 15 దాటాక ఏపీలో సంచలనాలు..!
అయితే..ఇది నాణేనికి ఒకవైపు మాత్రమేనని పరిశీలకులుచెబుతున్నారు. అసలు వ్యవహారం అంతా కూడా ముందు ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 11 Jan 2024 5:30 PM GMTఏపీలో రాజకీయ వాతావరణం ఇప్పటికే సల సల మరుగుతోంది. జంపింగుల జోరు కూడా పెరిగింది. వైసీపీలో టికెట్ దక్కనివారు.. దక్కినా.. తమకు నచ్చిన సీటు ఇవ్వలేదని బాధపడుతున్నవారు.. పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. కొందరు ఇప్పటికే(సీ రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు వంటివారు) పార్టీ మారిపోయారు. ఇక, టీడీపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఇమడలేమని భావిస్తున్నవారు.. కండువా మార్చేస్తున్నారు
అయితే..ఇది నాణేనికి ఒకవైపు మాత్రమేనని పరిశీలకులుచెబుతున్నారు. అసలు వ్యవహారం అంతా కూడా ముందు ఉందని అంటున్నారు. ప్రస్తుతం సంక్రాతి నెల.. పెద్దల మాసంగా భావిస్తున్నారని.. అందుకే.. జంపింగులను ఆచి తూచి చేస్తున్నారని అంటున్నారు. ఈ నెల 15 సంక్రాంతి అనంతరం.. మరిన్ని జంపింగులు ఉంటాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఎక్కువగా వైసీపీ నుంచి జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను షర్మిల చేపట్టేది కూడా సంక్రాతి తర్వాత.. లేదా ఆమె కుమారుడి వివాహం తర్వాత.. ఉంటుందని, ఇక, అప్పటి నుంచి అసలు ఆట మొదలు కానుందని.. వైసీపీ లేదా టీడీపీ లనుంచి కూడా భారీ ఎత్తున నాయకులు తరలిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఇక, జనసేనలోనూ కొందరు నాయకులు చేరిపోయేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.
ఎలా చూసుకున్నా.. ఈ నెల 15 తర్వాత రాష్ట్రంలో మరిన్నిసంచలనాలకు చోటు ఉంటుందని అంటున్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన బీఆర్ ఎస్ కూడా.. ఈ దఫా నాలుగునుంచి 6 స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నదరిమిలా.. ఈ పార్టీ కూడా చాపకింద నీరులాగా వ్యవహరిస్తోందని.. ఇది కూడా సంక్రాంతి తర్వాత.. ఒక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ నెల 15 తర్వాత.. ఏపీలో రాజకీయ సెగలు.. పొగలు మరింతగా పెరుగడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.