Begin typing your search above and press return to search.

కుర్చీ తాత రెమ్యునరేషన్ గురించి తెలిశాక థమన్ కు తిట్ల దండకం

సినిమా పాపులార్టీ కోసం మరీ ఇంత బరితెగించాలా? అంటూ మండిపడుతున్న వారు లేకపోలేదు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 4:14 AM GMT
కుర్చీ తాత రెమ్యునరేషన్ గురించి తెలిశాక థమన్ కు తిట్ల దండకం
X

ఆ కుర్చీని మడతబెట్టి.. అంటూ ఒక నాటు బూతును ఆన్ లైన్ లో వాడేసిన ఒక పెద్దాయన మాట ఎంతలా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నాటు బూతును.. తమ అరవీర భయంకరమైన నాటుపాటలో వాడేశారు సంగీత దర్శకులు థమన్. మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడతపెట్టి పాట ఇప్పుడు పెను సంచలనంగా మారటమే కాదు.. మరీ ఇంత నాటేంది సామి అంటూ మండిపడుతున్నారు.

సినిమా పాపులార్టీ కోసం మరీ ఇంత బరితెగించాలా? అంటూ మండిపడుతున్న వారు లేకపోలేదు. ఒక ప్రముఖ హీరో.. అందునా మహేశ్ బాబు లాంటి హీరో చేత.. హీరోయిన్ తో ఆడే పాటలో.. ఆ కుర్చీని మడతపెట్టి లాంటి పదాన్ని వాడాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అసలుదీనికి మహేశ్ ఎలా ఓకే చేశారన్న విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆ కుర్చీని మడతబెట్టి మాట వాడిన తాతకు సంగీత దర్శకుడు థమన్ రెమ్యునరేషన్ చెల్లించారన్న మాటను పలువురు ఫిదా కావటం.. థమన్ ను ఆకాశానికి ఎత్తేయటం తెలిసిందే.

అయితే.. కుర్చీ తాతకు ఇచ్చిన థమన్ ఇచ్చిన రెమ్యునరేషన్ రివీల్ అయ్యాక మాత్రం థమన్ ఏకిపారేస్తున్నారు. మరీ.. ఇంత తక్కువ మొత్తం ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ కుర్చీ తాతకు థమన్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అక్షరాల రూ.5వేలు. ఆ విషయాన్ని సదరు కుర్చీ తాతనే ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో.. రెమ్యునరేషన్ ఇచ్చారన్న విషయం తెలిసినప్పుడు పొగిడిన వాళ్లు సైతం.. ఇప్పుడు థమన్ ను తప్పు పడుతున్నారు.

కుర్చీ తాత విషయానికి వస్తే.. హైదరాబాద్ లోని కాలా పాషా అనే తాత ఒక యూట్యూబ్ చానల్ తో మాట్లాడే సందర్భంలో పరమ నాటు బూతునువాడేశారు. ఆ కుర్చీ మడతపెట్టి.. అంటూ సాగే బూతును చిట్టి వీడియోల్లో తెగ వాడేయటం తెలిసిందే. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఆ డైలాగ్ తో సదరు తాతను కుర్చీ తాతగా పిలవటం షురూ చేశారు. తాజాగా ఆ పదాన్ని తన పాటకు వాడుకున్న థమన్ రూ.5వేలు రెమ్యునరేషన్ ఇవ్వటాన్ని ప్రస్తావిస్తూ.. థమన్ ఎంత ఉదారజీవి? అంత భారీ మొత్తం ఇచ్చారా? అంటూ ఎటకారం ఆడేస్తున్నారు.