Begin typing your search above and press return to search.

ఘోర ఘటన వీడియో... రీల్స్ చేస్తుండగా తల తెగి యువకుడు మృతి!

ఎవరిని ఎప్పుడు ఎలా మృత్యువు కాటేస్తుందనేది ఎవరికీ తెలియదు! జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం ఎప్పుడూ పక్కనే పొంచి ఉంటుంది!

By:  Tupaki Desk   |   21 Oct 2024 3:44 AM GMT
ఘోర ఘటన వీడియో... రీల్స్  చేస్తుండగా తల తెగి యువకుడు మృతి!
X

ఎవరిని ఎప్పుడు ఎలా మృత్యువు కాటేస్తుందనేది ఎవరికీ తెలియదు! జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం ఎప్పుడూ పక్కనే పొంచి ఉంటుంది! ఈ క్రమంలో తాజాగా నలుగురు స్నేహితులతో సరదాగా గడుపుతున్నట్లు కనిపిస్తూ.. రీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు స్లో మోషన్ లో నడుచుకుంటూ వచ్చిన ఓ యువకుడు ఊహించని రీతిలో మృతువాత పడ్డాడు.

అవును... ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అప్పటివరకూ సరదాగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా రక్తసిక్తమైన ఘటన కలకలం రేపుతోంది. తాజాగా ఓ 20 ఏళ్ల యువకుడు రీల్ కోసం ట్రై చేస్తున్నట్లు కనిపిస్తూ.. దుర్మరణం పాలయ్యాడు. యూపీలోని ఆగ్రాలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర భయానకంగా ఉంది.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందినదిగా చెబుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో.. ఐదుగురు యువకులు కనిపిస్తున్నారు. వీరిలో ఇద్దరు యువకులు కూర్చుని ఫోన్ చూస్తూ, ఎదురుగా ఉన్న యువకుడితో మాట్లాడుతుండగా.. ఓ యువకుడు షాపు షట్టర్ తెరవడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సమయంలో మరో యువకుడు కుర్చున్న యువకులకు ఎదురుగా నిలబడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించాడు. ఇందులో భగంగా స్లో మోషన్ లో నడుస్తూ ముందుకు కదిలాడు.. ఈ సమయంలో తన ఎదురుగా ఉన్న గ్యాలరీలో అమర్చిన ఇనుప నెట్ ను పైకి లేపాడు. అయితే.. దాని అతడు బ్యాలెన్స్ చేయలేకో, కాలుజారో కానీ లోపలకు పడిపోయాడు.

దీంతో బరువైన ఆ ఇనుప నెట్ అతడిపై పడి తల తెగి పడినట్లు తెలుస్తోంది! ఈ సమయంలో అతడు మూడో అంతస్తు నుంచి కింద పడిపోయాడు! దీంతో అక్కడున్న మిగతా యువకులు అతడిని కాపాడేందుకు పరుగులు తీశారు. అయితే... అప్పటికే ఆ యువకుడి రక్తపుమడుగులో పడి మృతి చెందాడని అంటున్నారు! అక్కడ నేలంతా నెత్తుటితో నిండిపోయింది.

దీనికి సంబంధించిన వీడియోలు సంచలనంగా మారాయి. కొత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బులియన్ మార్కెట్ లో ఈ ఘోరం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు!