Begin typing your search above and press return to search.

అమెరికాలోని ఇంట్లో భారీ పేలుడు.. 14కి.మీ. దూరానికి శబ్దాలు

కానీ.. తాజా పేలుడు మాత్రం ఏకంగా 14 కిలోమీటర్ల దూరం వరకు వినిపించటమే కాదు.. దాని ధాటికి ఒక్కసారిగా షాక్ కు గురైన పరిస్థితి.

By:  Tupaki Desk   |   1 Jan 2024 3:59 AM GMT
అమెరికాలోని ఇంట్లో భారీ పేలుడు.. 14కి.మీ. దూరానికి శబ్దాలు
X

అగ్రరాజ్యం అమెరికాలోని ఒక ఇంట్లో చోటు చేసుకున్న భారీ పేలుడు ఉదంతం ఉలిక్కిపడేలా చేస్తోంది. కారణం.. పేలుడు తీవ్రత గురించి తెలిసిన వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కారణం.. దీని తీవ్రత అంత ఎక్కువగా ఉండటమే. సాధారణంగా ఒక ఇంట్లో జరిగే పేలుడు తీవ్రత.. మహా అయితే ఒక కి.మీ. దూరం వరకు వినిపించే అవకాశం ఉంటుంది. అది కూడా భారీ పేలుడు అయితే. కానీ.. తాజా పేలుడు మాత్రం ఏకంగా 14 కిలోమీటర్ల దూరం వరకు వినిపించటమే కాదు.. దాని ధాటికి ఒక్కసారిగా షాక్ కు గురైన పరిస్థితి.

నలుగురు మరణానికి కారణమైన ఈ పేలుడు వివరాల్లోకి వెళితే.. డెట్రాయిట్ సమీపంలోని నార్త్ ఫీల్డ్ టౌన్ షిప్ లో ఈ భారీ పేలుడు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ పేలుడులో సదరు నిర్మాణం మొత్తం తునాతనకలైనట్లుగా చెబుతున్నారు. ఈ పేలుడు శబ్దం పద్నాలుగు కి.మీ. దూరానికి వినిపించటంతో పాటు నలుగురి ప్రానాల్ని తీయగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది.

శిథిలాలు ఇంటి సమీపంలోని హైవే వరకు ఎగిరిపడినట్లుగా చెబతున్నారు. ఇంత దూరానికి పేలుడు శబ్దాలు వినిపించటం వెనుక కారణం ఏమిటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. పేలుడు సమాచారం అందుకున్నంతనే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వేళలో.. పేలుడు జరిగిన ఇంట్లో ఆరుగురు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ పేలుడు తీవ్రతకు ఆ ఇంటికి దగ్గర్లో ఉన్న ఇళ్లు దెబ్బ తినలేదని చెబుతున్నారు. పేలుడు శబ్ధం అంత దూరానికి వినిపించటం వెనుక ఉన్న కారణంపై అధికారులు ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. పేలుడుకు అసలు కారణంఏమిటన్నది తేలాల్సి ఉంది.