కమల పంట కోత, ట్రంప్ గుడి శుభ్రత... ఏఐ పిక్స్ వైరల్!
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ లు భారతీయ రాజకీయ నాయకులు అయితే?
By: Tupaki Desk | 3 Nov 2024 3:56 AM GMTనవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ లు ప్రచార కార్యక్రమల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా... స్వింగ్స్ స్టేట్స్ పై ఇప్పుడు పూర్తి వారి కాన్సంట్రేషన్ పెట్టారని అంటున్నారు. ఈ సమయంలో వారిద్దరూ భారత్ లోని ఎన్నికల్లో పోటీపడుతున్నట్లయితే వారి ప్రచారం ఎలా ఉంటుందో ఏఐ పిక్స్ ఆవిష్కరించారు!
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ లు భారతీయ రాజకీయ నాయకులు అయితే? అనే ఆలోచన వచ్చింది షాహిద్ ఎక్స్ అనే వ్యక్తికి. దీంతో.. వాళ్లు భారత్ లో ఎన్నికల ప్రచారం చేస్తే ఎలా ఉంతుందో తెలిపేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) జనరేటెడ్ ఫోటోలను రూపొందించారు. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ ఫోటోల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ లు ఓపెన్ జీప్ లో నిల్చుని చేతిలో ఎన్నికల గుర్తులు వంటివి పట్టుకుని, రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ట్రంప్ మద్దతుదారుడు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. ఇదే సమయంలో... ఓటర్ల పిల్లలను ఎత్తుకుని ముద్దు చేయడం, పేదల ఇళ్లల్లో భోజనాలు చేయడం వంటివి కూడా చేశారు.
ఇదే సమయంలో కమలా హారిస్ ఓ చోట వంటశాలలో పులిహార కలుపుతూ కనిపించగా.. మరోచోట పొలంలో పంట కోత కోస్తున్నట్లు కనిపించారు. బరక్ ఒబామాతో కలిసి విక్టరీ సింబల్ చూపిస్తూ ఓపెన్ జీప్ లో ర్యాలీ చేశారు! ఇక డొనాల్డ్ ట్రంప్ అయితే... ఓ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ పిక్స్ వైరల్ గా మారాయి!
కాగా... అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చివరి వారంలో పూర్తిగా స్వింగ్ స్టేట్స్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఇందులో భాగంగా... అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు బలమైన మద్దతును కలిగి ఉన్న బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లో అధ్యక్ష అభ్యర్థులు ఇద్దరూ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నారు.