Begin typing your search above and press return to search.

రేడియో స్టేషన్ లో జర్నలిస్టుల స్థానంలో ఏఐ.. ఎల్జీబీటీక్యూ+ కోసమంట!!

దీనిపై ప్రజలు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 6:30 AM GMT
రేడియో స్టేషన్  లో జర్నలిస్టుల స్థానంలో ఏఐ.. ఎల్జీబీటీక్యూ+ కోసమంట!!
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయని నిపుణులు చెప్పిన విషయాలను ఎంతోమంది జర్నలిస్టులు చదవడం, రాయడం చేసి ఉంటారు! అయితే అనూహ్యంగా ఆ జర్నలిస్టుల ఉద్యోగాలకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎసరు పెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రజలు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు.

అవును... పోలాండ్ లోని ఓ రేడియో స్టేషన్ లో తన జర్నలిస్టులను తొలగించి ఏఐ రూపొందించిన ప్రజెంటర్ లను నియమించింది. దక్షిణ సిటీ క్రాక్ లో ఓ.ఎఫ్.ఎఫ్. రేడియో ఇటీవల ఈ ప్రయత్నం చేసింది. దీన్ని... "ది ఫస్ట్ ఎక్స్ పెరమెంట్ ఇన్ పోలాండ్" అని పిలిచింది! ఈ విషయాలపై స్టేషన్ హెడ్ స్పందించారు.

ఇందులో భాగంగా... ఎల్జీబీటీక్యూ+ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వశ్చనింగ్, ఇంటర్ సెక్స్, అలైంగిక మొదలైన..) సమస్యలతో సహా.. సాంస్కృతిక, సామాజిక అంశాల గురించి చర్చించడం ద్వారా యువ వీక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో తమ మూడు ఏఐ అవతార్ లు ఉన్నాయని తెలిపారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి!

ఈ సమయంలో మాజీ హోస్ట్, సినిమా క్రిటిక్, జర్నలిస్ట్ మాటెస్ట్ డెమ్స్కీ బహిరంగ లేఖను విడుదల చేశారు! దీంతో... ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది! మీడియా, క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉద్యోగులను బెదిరించే ప్రమాదకరమైన పరిస్థితులను ఇది సెట్ చేస్తుందని ఆయన విమర్శించారు!

ఇదే సమయంలో... ఈ వ్యవహారంపై స్పందించిన పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రి.. ఏఐ పెరుగుదల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి లానీ.. వారికి హాని కలిగించకూడదని పేర్కొంది. మరోపక్క... ఈ నిర్ణయంపై స్థానిక జర్నలిస్టులు మండిపడగా.. నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ, యాజమాన్యానికి లేఖలు రాస్తున్నారని తెలుస్తోంది!