Begin typing your search above and press return to search.

ఏఐ సీఈఓ "గివింగ్ ప్లెడ్జ్"... ఆల్ట్ మాన్ అసక్తికర వ్యాఖ్యలు!

ప్రపంచ వ్యాప్తంగా "గివింగ్ ప్లెడ్జ్" అనేది ఎంత గొప్ప విషయం అనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 May 2024 11:33 AM GMT
ఏఐ సీఈఓ గివింగ్  ప్లెడ్జ్... ఆల్ట్  మాన్  అసక్తికర వ్యాఖ్యలు!
X

ప్రపంచ వ్యాప్తంగా "గివింగ్ ప్లెడ్జ్" అనేది ఎంత గొప్ప విషయం అనే సంగతి తెలిసిందే. 2010లో బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, వారెన్ బఫ్ఫెట్‌ లతో స్థాపించబడిన "గివింగ్ ప్లెడ్జ్".. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులు తమ సంపదలో ఎక్కువ భాగాన్ని దాతృత్వ ప్రయత్నాలకు అంకితం చేయమని ప్రోత్సహిస్తుంది.

తమకున్న సంపదలో వీలైనంత ఎక్కువ మొత్తం సమాజానికి ఇవ్వడాన్ని ప్రోత్సహించడానికి "గివింగ్ ప్లెడ్జ్" ఏర్పాటు చేయడం అత్యంత అభినందనీయం అనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా ఆ ప్లెడ్జ్ చేసినవారి జాబితాలో తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్‌ హౌస్ ఓపెన్‌ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌ మాన్ చేరారు.

అవును... తమ సంపదలో మెజారిటీని సమాజానికి ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్న బిలియనీర్ల జాబితాలో తాజాగా ఓపెన్‌ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌ మాన్ చేరారు. ఇటీవల బిలియనీర్ హోదాను సాధించిన ఆల్ట్‌ మాన్.. తన పార్ట్ నర్ అయిన ఆలివర్ ముల్హెరిన్‌ తో కలిసి "గివింగ్ ప్లెడ్జ్‌" పై సంతకం చేశాడు. ఈ సందర్భంగా... ఆల్ట్‌ మాన్ – ముల్హెరిన్ తమ విజయానికి కారణమైన సామాజిక నిర్మాణాలకు ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆల్ట్ మన్... ప్రపంచాన్ని మెరుగుపరచడానికి కృషి, దాతృత్వం, అంకితభావం లేకుంటే తాము ఈ ప్రతిజ్ఞ చేయమని తెలిపారు. సమాజానికి ఆర్థికంగా తమవంతు కృషి చేయడానికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే... టెక్నాలజీలోనూ సమాజ అభివృద్ధికి పాటు పడేలా కృషి చేస్తామని తెలిపారు.